MDK: మాసాయిపేట మండలం పోతాన్ శెట్టిపల్లి గ్రామంలో అండర్ డ్రైనేజ్ పనులకు సర్పంచ్ ప్రశాంత్ ఆధ్వర్యంలో శంకుస్థాపన నిర్వహించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య లేకుండా ఉండేందుకు పనులు నిర్వహిస్తున్నట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కిరణ్ నాయక్, వార్డు నెంబర్లు సందీప్ రెడ్డి, భాగ్యలక్ష్మి, ధనమ్మ , స్వామి, కృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.