BDK: రాష్ట్రవ్యాప్త బదిలీల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెవెన్యూ అధికారి (DRO)గా ఎస్. పద్మావతి నియమితులయ్యారు. స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన ఈమె, ప్రస్తుతం హైదరాబాద్‌లోని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATG)లో డెప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి ఆమెను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.