SRPT: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సూర్యాపేట పట్టణంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ నివేదితా తెలిపారు. సూర్యాపేట పట్టణంలో ప్రధాన నాలాల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను మున్సిపల్ చైన్ వెహికల్ మిషన్ ద్వారా తొలగిస్తున్నట్లు తెలిపారు. నాలాల్లో చెత్త వేయవద్దని, పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.