VKB: దోమ మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొత్త సర్పంచులు బాధ్యతలు చేపట్టి కాలం చెల్లుతున్నా, కార్యాలయంలోని సూచిక బోర్డులపై మాత్రం ఇంకా పాత పేర్లే దర్శనమిస్తున్నాయి. దీంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. అధికారులకు కనీసం సమాచార బోర్డును మార్చాలనే ఆలోచన లేకపోవడంపై విమర్శించారు.