NRPT: జిల్లాలోని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగుల కొరత ఉందని రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు మంగళవారం డీటీ బీబీ హజ్రాకు వినతి పత్రం అందజేశారు. రైతులకు గన్ని బ్యాగులు సరఫరా చేయాలని, అలాగే లారీలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో తిరుపతయ్య, రవికుమార్, కృష్ణారెడ్డి, నర్సింలు, విష్ణు కాంత్ రెడ్డి, శివ, వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.