జనగామ జిల్లాకి నూతనంగా వచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గంలోని పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ని కోరారు. కలెక్టర్ సైతం సానుకూలంగా స్పందించారు.