MBNR: చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని దేవాదాయ శాఖ స్థపతి వల్లీ నాయక్ సందర్శించారు. మహా మండపం నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన చేసి అధికారులకు సూచనలు చేశారు. దాతల సహకారంతో చేపట్టనున్న నిర్మాణానికి త్వరలో ప్లాన్, అంచనాలు సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ మదనేశ్వర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అర్చకులు పాల్గొన్నారు.
HYD: హైదరాబాద్ సిటీ విజిలెన్స్ టీం అధికారులు కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పర్యావరణ ఇంజినీర్లు వివిధ సంస్థలపై తనిఖీ నివేదికలు సమర్పించకపోవడం గమనించారు. అలాగే.. HYD పరిధిలోని పరిశ్రమల వివరాలు రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టంలో సమయానికి అప్‌డేట్ కాకపోవడం వల్ల ఆలస్యం ఏర్పడుతున్నట్లు గుర్తించారు.
JGL: జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వాసవీ మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్.లత పాల్గొన్నారు. వాసవీ మాత జయంతి సందర్భంగా ధర్మం, అహింస, సమానత్వం వంటి మహోన్నత విలువలను ప్రపంచానికి తెలియజేసిన వాసవీ మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
MDK: రామాయంపేట మండలం “స్కవెంజర్‌గా పాఠశాల ఊడ్చడం, బాత్‌రూమ్‌లు కడగడం వంటి పనులు చేస్తున్నా జీతం ఇవ్వడం లేదు” అని శ్యామమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. జీతమడిగితే హెచ్‌ఎం నాగమణి బెదిరిస్తున్నారని, తిండికి కూడా పైసల్లేక ఇబ్బంది పడుతున్నానని నిరసనలో వాపోయారు. అధికారులు స్పందించి తనకు రావాల్సిన బకాయిలు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
JGN: ప్రధానమంత్రి మోడీ ఆదివారం నిర్వహించిన ‘మన్‌కీ బాత్’ 133వ ఎపిసోడ్‌ను జాఫర్‌గడ్ మండలం ఉప్పుగల్లు, కునూర్ గ్రామాల్లో బీజేపీ నేతలు వీక్షించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధాన్ని పెంచడమే మన్‌కీ బాత్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ అన్నారు. బైరు పవన్, గడ్డం అరవింద్ తదితరులు ఉన్నారు.
KMM: కుల వివక్షత పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ఖమ్మం నగరంలో కుల రహిత సమానత్వ, సంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ తెలిపారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సాంస్కృతిక ఉత్సవాలలో కళాకారులు, మేధావులు పాల్గొనాలని కోరారు.
మంచిర్యాల జిల్లాలోని 56 గ్రామాల్లో ఈనెల 27న ‘రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు KVK క్లస్టర్ ఇన్ఛార్జ్ స్రవంతి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ప్రొ. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, వ్యవసాయ శాఖ సమన్వయంతో సాగే ఈ సదస్సుల్లో హైదరాబాద్ నుంచి నిపుణులు హాజరుకానున్నారు. నూతన వంగడాలు, ఆధునిక సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.
NZB: డొంకేశ్వర్ మండలాల్లోని పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఉందని వినియోగదారులు ఆరోపించారు. మండలంలోని 3 బంకుల్లో అలాగే డొంకేశ్వర్ మండలం తోండాకూర్ బంకుల్లో కూడా డీజిల్ లేకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పంట కోతల సమయం కావడంతో హార్వెస్టర్, ట్రాక్టర్లకు డీజిల్ లేక అల్లాడిపోతున్నామన్నారు.
NRML: నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ లో పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం కాలనీలోని డ్రైనేజీలను యంత్రాల సహాయంతో శుభ్రం చేశారు. గత రెండు రోజుల క్రితం కాలనీవాసులు కాలనీలోని సమస్యలపై మున్సిపల్ వైస్ ఛైేర్మన్‌కు వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే. స్పందించిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ పారిశుధ్య పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
SRCL: పేదల సొంత ఇంటి కలలను నిజము చేయడమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మంగళ పల్లె గ్రామం లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు.
NZB: ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో ఉన్న కాలనిలో ఉన్నా వాసవి కన్యకా మాత పరమేశ్వర దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇవాళ వాసవి మాత జన్మదిన వేడుకలను నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. వైశ్యులు పెద్ద సంఖ్యలో వచ్చి తమ మొక్కలను మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘ సభ్యులు, మహిళా భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
WNP: శ్రీ ముద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో 333వ ఆరాధనా ఉత్సవం సందర్భంగా గణపతి పూజ, యజ్ఞంతో పాటు పలు పూజా కార్యక్రమాలతో ఆలయం సందడిగా మారింది. ఇవాళ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పల్లకి సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
కామారెడ్డి పట్టణంలోని స్టేషన్ రోడ్డులో గల కామారెడ్డి ఫార్మసీ & సర్జరీకల్ వారి ఆధ్వర్యంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామణ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు ఉచితంగా చల్లని మజ్జిగ అందించడం ద్వారా ఎండల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.
NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లికి చెందిన బుడుమ కృష్ణమ్మ ఇంటి నిర్మాణం ఆర్థిక ఇబ్బందుల వల్ల నిలిపోయింది. ఈ విషయాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన మానవ దృక్పథంతో ఇంటి నిర్మాణానికి అవసరమైన 50 బ్యాగుల సిమెంట్, రెండు క్వింటాళ్ల ఇనుము (సీకు)ను ఈరోజు అందజేశారు.
MLG: జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకుంటుండగా 8 ఏళ్ల బాలికకు విద్యుత్ షాక్ తగిలింది. లక్ష్మీపురం గ్రామానికి చెందిన కావ్యశ్రీ స్లాబ్‌పై ఆడుతుండగా 11కేవీ తీగలు తగిలాయి. తీవ్ర గాయాలతో చిన్నారిని హన్మకొండ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స కోసం దాతలు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.