MLG: జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకుంటుండగా 8 ఏళ్ల బాలికకు విద్యుత్ షాక్ తగిలింది. లక్ష్మీపురం గ్రామానికి చెందిన కావ్యశ్రీ స్లాబ్‌పై ఆడుతుండగా 11కేవీ తీగలు తగిలాయి. తీవ్ర గాయాలతో చిన్నారిని హన్మకొండ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స కోసం దాతలు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
RR: ఆర్యవైశ్యులపై మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి అభిమానమని అందుకే ఈ వేడుకలు అధికారికంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలోని వాసవి మాత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు కులదైవంగా భావించే కన్యక పరమేశ్వరి జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
VKB: తాండూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీనగరేశ్వర దేవాలయంలో అమ్మవారికి లక్ష గాజులతో అర్చన నిర్వహించారు. అమ్మవారి జయంతిని పురస్కరించుకుని లక్ష గాజులతో అలంకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. అమ్మవారి దీవెనలతో ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
NLG: విద్యార్థులు చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి బి. సైదులు సూచించారు. శనివారం కనగల్ లోని మహాత్మా జ్యోతిబాఫులే గురుకులంలో ఉమ్మడి నల్గొండ, మహబూబుబ్‌నగర్ జిల్లాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నైపుణ్యాలు ఉంటేనే భవిష్యత్తులో ప్రగతి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
HYD: హైదరాబాద్ సిటీ-II యూనిట్ అధికారులు ట్రూప్ బజార్‌లోని గోషామహల్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కస్టమర్ సర్వీస్ సెంటర్(ICSC)లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అసిస్టెంట్ ఇంజినీర్ రిజిస్టర్ల నవీకరణ, సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించడంలో విఫలమైనట్లు గుర్తించారు. 193 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని వెల్లడైంది.
MLG: జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎండ దంచి కొడుతోంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవడంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు సైతం ఎండ వేడి తగలకుండా తలకు కర్చీఫ్, టవల్, స్కార్ఫ్‌లు కట్టుకొని వెళ్తున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లపై వాహనాలు తిరగడం లేదు. ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
NRML: ప్రియదర్శిని నగర్‌లో మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే పోచమ్మ అమ్మవారి బోనాల పండుగ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు.
KNR: జనగణన-2027లో భాగంగా కరీంనగర్ జిల్లాలో ‘స్వీయ గణన (Self Enumeration) ప్రారంభమైంది. మే 10 వరకు ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ చిత్ర మిశ్రా తెలిపారు. https://se.census.gov.in లాగిన్ అయి, 34 రకాల ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలి. అనంతరం వచ్చే 11 అంకెల సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ (SE ID)ని, ఇంటికి వచ్చినా ఎనిమినేటర్‌కు చూపించాలన్నారు.
MBNR: చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని దేవాదాయ శాఖ స్థపతి వల్లీ నాయక్ సందర్శించారు. మహా మండపం నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన చేసి అధికారులకు సూచనలు చేశారు. దాతల సహకారంతో చేపట్టనున్న నిర్మాణానికి త్వరలో ప్లాన్, అంచనాలు సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ మదనేశ్వర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అర్చకులు పాల్గొన్నారు.
HYD: హైదరాబాద్ సిటీ విజిలెన్స్ టీం అధికారులు కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పర్యావరణ ఇంజినీర్లు వివిధ సంస్థలపై తనిఖీ నివేదికలు సమర్పించకపోవడం గమనించారు. అలాగే.. HYD పరిధిలోని పరిశ్రమల వివరాలు రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టంలో సమయానికి అప్‌డేట్ కాకపోవడం వల్ల ఆలస్యం ఏర్పడుతున్నట్లు గుర్తించారు.
JGL: జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వాసవీ మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్.లత పాల్గొన్నారు. వాసవీ మాత జయంతి సందర్భంగా ధర్మం, అహింస, సమానత్వం వంటి మహోన్నత విలువలను ప్రపంచానికి తెలియజేసిన వాసవీ మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
MDK: రామాయంపేట మండలం “స్కవెంజర్‌గా పాఠశాల ఊడ్చడం, బాత్‌రూమ్‌లు కడగడం వంటి పనులు చేస్తున్నా జీతం ఇవ్వడం లేదు” అని శ్యామమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. జీతమడిగితే హెచ్‌ఎం నాగమణి బెదిరిస్తున్నారని, తిండికి కూడా పైసల్లేక ఇబ్బంది పడుతున్నానని నిరసనలో వాపోయారు. అధికారులు స్పందించి తనకు రావాల్సిన బకాయిలు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
JGN: ప్రధానమంత్రి మోడీ ఆదివారం నిర్వహించిన ‘మన్‌కీ బాత్’ 133వ ఎపిసోడ్‌ను జాఫర్‌గడ్ మండలం ఉప్పుగల్లు, కునూర్ గ్రామాల్లో బీజేపీ నేతలు వీక్షించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధాన్ని పెంచడమే మన్‌కీ బాత్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ అన్నారు. బైరు పవన్, గడ్డం అరవింద్ తదితరులు ఉన్నారు.
KMM: కుల వివక్షత పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ఖమ్మం నగరంలో కుల రహిత సమానత్వ, సంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ తెలిపారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సాంస్కృతిక ఉత్సవాలలో కళాకారులు, మేధావులు పాల్గొనాలని కోరారు.
మంచిర్యాల జిల్లాలోని 56 గ్రామాల్లో ఈనెల 27న ‘రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు KVK క్లస్టర్ ఇన్ఛార్జ్ స్రవంతి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ప్రొ. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, వ్యవసాయ శాఖ సమన్వయంతో సాగే ఈ సదస్సుల్లో హైదరాబాద్ నుంచి నిపుణులు హాజరుకానున్నారు. నూతన వంగడాలు, ఆధునిక సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.