HYD: ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ పార్టీ మారారని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారని BRS నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ బీ ఫామ్‌పై సికింద్రాబాద్ ఎంపీగా దానం పోటీ చేసినా స్పీకర్‌కు కనపడలేదా, పార్టీ మారారనటానికి ఇంతకు మించిన ఆధారాలు కావాలా అని ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.
NLG: గుడిపల్లి మండలం సింగరాజుపల్లి, కోదండాపురం గ్రామాలలో రూ.20లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలునాయక్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

WGL: పార్టీ ఫిరాయింపుల కేసులో MLA కడియంకి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై స్పందించిన కడియం.. మాజీ సీఎం KCRకు సవాల్ విసిరారు. ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ క్షమాపణలు చేబితే రాజీనామాకు సిద్ధమన్నారు. ‘స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నా. నాపై వేసిన పిటిషన్లు చట్టబద్ధం కావు. పార్టీ పరంగా ఎందుకు పిటిషన్ వేయలేదని KCRను ప్రశ్నిస్తున్నా’ అని పేర్కొన్నారు.

NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణను బుధవారం అచ్చంపేట పట్టణంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ప్రజాసేవ చేస్తున్నందుకు అభినందిస్తూ ఈ సన్మానం చేసినట్లు క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి, రఘుపతి రెడ్డి, యాదయ్య గౌడ్, భరత్, రాజు, ప్రశాంత్ రెడ్డి, జూలూరి సురేశ్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
WGL: వరంగల్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం రాత్రి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ &తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ విభాగంలో అత్యధికంగా 54 కేసులు, సెంట్రల్ జోన్‌లో 18, వెస్ట్ జోన్‌లో 11, ఈస్ట్ జోన్‌లో 6 కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు.
SRD: సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మైదానంలో కబడ్డీ పోటీలను అంతర్జాతీయ కోచ్ శ్రీనివాస్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. కబడ్డీ ఆడుతున్న విద్యార్థులతో కరచాలనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
BDK: బూర్గంపాడు మండలం నకిరేపేట పరిధిలోని దోమల వాగును సీతారామ ప్రాజెక్ట్‌కు అనుసంధానం చేస్తూ మినీ రిజర్వాయర్‌గా తీర్చిదిద్దేలా ఎమ్మెల్యే పాలెం వెంకటేశ్వర్లు ఇవాళ తూము ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిరేపేట నుంచి వేపలగడ్డ వరకు సుమారు 800 ఎకరాల వ్యవసాయ భూమికి నీరు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీ సమస్యలు ఉండకూడదని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 47, 48 డివిజన్లో డిప్యూటీ మేయర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఈ, ఏఈతో మాట్లాడుతూ.. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

SGR: పంచాయతీ కార్మికుల మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా ఇంఛార్జ్ పంచాయతీ అధికారి జానకి రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు రహమాన్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు మూడు నెలల వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వెంటనే అధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలని కోరారు.
MHBD: BRS MLC తక్కళ్లపల్లి రవీందర్ మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు వాసుదేవరావు (ఆశన్న)ను కలిశారు. ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులపై వారు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. సీనియర్ జర్నలిస్ట్ అశోక్, అంతర్జాతీయ జల నిపుణులు డా.బిక్షం గుజ్జా తదితరులున్నారు. అరణ్యాన్ని వీడి జనజీవనస్రవంతిలోకి వచ్చిన ఆశన్నతో సమావేశం అవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
KMM: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి-ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మడుపల్లి గ్రామంలో అభివృద్ధి పనులను 5వ వార్డు కౌన్సిలర్ వేమిరెడ్డి లక్ష్మీ తులసి చేపట్టారు. గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత, ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు కల్పించాలనే లక్ష్యంతో గ్రామంలోని శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కౌన్సిలర్ తెలిపారు.
ADB: అంగన్వాడీల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. నేరడిగొండ మండలంలోని అంగన్వాడీలు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీ టీచర్ల ద్వారానే ప్రీ ప్రైమరీ బోధన కొనసాగించాలన్నారు. కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.