ADB: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్యాల కరుణాకర్ బుధవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. మండల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రికి విన్నవించారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. భారత్ జూడో యాత్రికుడు జాంటీ, నాయకులు తదితరులున్నారు.