ASF: జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హరిత గారు ఐడీఓసీ (IDOC) సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అట్రాసిటీ కేసుల విచారణను వేగవంతం చేయాలని, బాధితులకు సకాలంలో పరిహారం అందేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, పోలీస్ మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.