WGL: పర్వతగిరి మండలం హాక్యా తండా కెనాల్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తులు వందల సంఖ్యలో చనిపోయిన ఫారం కోళ్లను పడేసి పోయారు. దీంతో స్థానికులకు దుర్వాసన రావడంతో పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ శాఖ వారు బుధవారం ఘటనను పరిశీలించి బ్లీచింగ్ పౌడర్ చల్లి శుభ్రపరచాలని డాక్టర్ బాలకృష్ణ ఆదేశించారు. కోళ్లను పడేసిన వారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు.