• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తెలంగాణ పోలీసుశాఖకు దేశంలోనే మంచి పేరుంది: DGP

KMM: తెలంగాణ పోలీసుశాఖకు దేశంలోనే మంచి పేరుందని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే నేరాల నియంత్రణలోనూ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోనూ ముందువరుసలో ఉన్నామని DGP శివధర్ రెడ్డి అన్నారు. ఆదివారం సీపీ సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీస్ శిక్షణ కేంద్రంలో పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వీయ అవగాహనతోనే సైబర్ మోసాలకు కళ్లెం వేయవచ్చన్నారు.

March 1, 2026 / 09:55 PM IST

ఎంపీ డీకే అరుణను కలిసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత

MBNR : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ వైద్యులు పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణను జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో కలిశారు. డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి అందించిన విశేష సేవలకు పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో ఆనందదాయకం ఎంపీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

March 1, 2026 / 09:44 PM IST

అధికారులు సమన్వయంతో పనిచేయాలి: మంత్రి

BDK: భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో నిర్వహించే శ్రీరామనవమి, రామయ్య పట్టాభిషేకం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు నీరు వసతి వంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

March 1, 2026 / 09:28 PM IST

వలలో చిక్కుకుని యువకుడు గల్లంతు

SRD : అమీన్ పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. బొమ్మనకుంటకు చెందిన రవి చెరువులో చాపలు పట్టే సమయంలో ప్రమాదవశాత్తు చేపల వలలో చిక్కుకుని గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. NTR బృందం సహాయంతో శోధన కొనసాగుతోంది.

March 1, 2026 / 09:23 PM IST

ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ అవసరం

JGL: ఆత్మరక్షణకు తైక్వాండో ఎంతో ఉపయోగపడుతుందని జగిత్యాల ఛైర్‌పర్సన్ వాణి తెలిపారు. జగిత్యాల టౌన్ హాల్లో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తైక్వాండో ఛాంపియన్షిప్ 2026 పోటీలను ఆమె ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం అవసరమని, తైక్వాండో ద్వారా క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మస్థైర్యం పెరుగుతాయన్నారు.

March 1, 2026 / 09:17 PM IST

రంజాన్ మాసం సేవా భావాలకు ప్రతీక: ఎమ్మెల్యే

RR: సామరస్యం పెంపొందించడంలో ఇఫ్తార్ విందులు ముఖ్య పాత్ర వహిస్తాయని MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని మిలీనియం టౌన్షిప్‌లో యువ నాయకులు కబీర్, తదితరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసం శాంతి, సహనం, సేవా భావాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ ఎల్లప్పుడు సమానత్వానికి కట్టుబడి ఉంటుందన్నారు.

March 1, 2026 / 09:09 PM IST

ఎన్నికల హామీల పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి: రాజేష్

BHPL: రాష్ట్రంలోని మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామన్న ఎన్నికల హామీ అమలు పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని TRP మొగులపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ పటేల్ డిమాండ్ చేశారు. వృద్ధులకు రూ.4,000 ఆసరా పెన్షన్, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగ భృతి వంటి హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

March 1, 2026 / 09:07 PM IST

ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడిగా సాంబయ్య

KNR: శంకరపట్నం మండల ఆర్ఎంపీ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. మొలంగూర్‌కు చెందిన పెంట సాంబయ్యను మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా పెసరి వీరార్జున్, కోశాధికారిగా గుండేటి సమ్మయ్యను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాంబయ్య మాట్లాడుతూ.. మండలంలో ఆర్ఎంపీ వ్యవస్థను బలోపేతం చేస్తానని పేర్కొన్నారు.

March 1, 2026 / 09:02 PM IST

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం

NLG: మిర్యాలగూడలో రాజీవ్ గాంధీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఇవాళ ఉత్సాహంగా జరిగింది. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్మికుల హక్కుల కోసం INTUC ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సహకారంతో పెయింటింగ్ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

March 1, 2026 / 08:53 PM IST

ఛైర్ పర్సన్‌కు ఆరెకటిక సంఘం ఘన సన్మానం

BHNG: శ్రీ రేణుక ఎల్లమ్మ ఆరెకటిక సంఘం అధ్యక్షులు హీరే కార్ శ్రీను ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్‌కు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరెకటిక సంఘం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మాలిక వసతుప అభివృద్ధిపై ఛైర్మన్ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

March 1, 2026 / 08:53 PM IST

జనగామలో భరోసా, షీటీం కేంద్రాల ప్రారంభం

 జనగామ జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం, షీటీం కేంద్రాలను డీజీపీ శివధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. డీజీపీకి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఘన స్వాగతం పలికారు. అనంతరం భరోసా, షీటీం కేంద్రాల్లోని వివిధ విభాగాలను డీజీపీ పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు.

March 1, 2026 / 08:52 PM IST

HYDలో కిలో లబ్బ మిర్చి రూ.100

HYDలో లబ్బ మిర్చికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం కిలో లబ్బ మిర్చి రూ.100కు విక్రయిస్తున్నారు. సాధారణంగా పచ్చళ్ల తయారీలో ఎక్కువగా వాడే ఈ మిర్చి ధర ఉప్పల్, ఎల్బీనగర్, అత్తాపూర్, అల్వాల్ ప్రాంతాల్లో దాదాపుగా ఇదే ధర పలుకుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. రాబోయే ఎండాకాలంలో పచ్చళ్ల సీజన్ కానుండగా, ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

March 1, 2026 / 08:50 PM IST

మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించిన..MRPS నేతలు

BHPL: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో ఆదివారం MRPS ఆధ్వర్యంలో SC వర్గీకరణ పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. SC వర్గీకరణ ఎమ్మార్పీఎస్, మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన మిలిటెంట్ పోరాటాల ఫలితమేనని అన్నారు.

March 1, 2026 / 08:48 PM IST

సామాజిక న్యాయమే లక్ష్యంగా పరిపాలన

NLG: అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తోందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. మాడ్గులపల్లి మండలం భీమనపల్లిలో నూతనంగా ప్రతిష్టించిన డా.బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుతానన్నారు.

March 1, 2026 / 08:46 PM IST

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు

VKB: తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్, సర్పంచ్ చంద్ర భూపాల్ రావు తెలిపారు. కుల్కచర్ల మండలంలోని ముజాహిద్పూర్ గ్రామంలో తాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయని కాలనీవాసులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు బోరు మోటర్ రిపేరు చేయించి ప్రజలకు తాగునీటి సమస్యలను పరిష్కరించారు.

March 1, 2026 / 08:46 PM IST