BDK: గ్రామ స్థాయిలో చేపట్టవలసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై ఎంపీడీవో శ్రీనివాసరావు చర్చించారు. అశ్వాపురం మండల రైతు వేదికలో గురువారం ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యచరణపై ఎంపీడీవో శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు పలు సూచనలు చేశారు.
NZB: చందూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సబ్‌మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకానైజేషన్ పథకం క్రింద మంజూరైన వ్యవసాయ యంత్రాంలను సర్పంచ్ మద్దూరి మాధవ రెడ్డి అర్హులైన రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందజేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు .
WNP: పదో తరగతి విద్యార్థులు గణితంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వకుండా మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ వనపర్తి గర్ల్స్ హైస్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ఏర్పాట్లను పరిశీలించారు.
HNK: ఐనవోలు మండలం నందనం గ్రామంలో నాబార్డ్ సహకారంతో నందనం సొసైటీ ఆధ్వర్యంలో రైతుల కోసం డ్రోన్ సేవలను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గురువారం ప్రారంభించారు. డ్రోన్ల ద్వారా పంటలకు ఎరువులు, పురుగు మందులు సమర్థంగా పిచికారీ చేయడం వల్ల రైతులకు ఖర్చు తగ్గడం, సమయం ఆదా కావడం లక్ష్యంగా పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతతో వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
GDWL: గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఒక్కొక్కరికి రూ.1,00,116 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో పెళ్లిళ్ల భారాన్ని తగ్గించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
BHNG: జిల్లా నూతన కలెక్టర్‌గా నియామకమైన అనురాగ్ జయంతి ఆలేరు పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాల తనిఖీకి చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ బీజన బాలమణి భాస్కర్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. అనంతరం ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్, అభివృద్ధికి తోడ్పడుతామన్నారు.
NRPT: పట్టణంలోని 17వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్లు కల్పన, ప్రభాకర్ రాజేష్ ఘట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహిళలకు గుడ్లు, బాలమృతం, పంపిణీ చేసి గర్భిణిలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం అందించే పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలని చెప్పారు.
ఆసిఫాబాద్ జిల్లా కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలకు మొత్తం 11 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 147 మందికి గాను 143 మంది హాజరుకాగా, నలుగురు రాలేదు. వొకేషనల్ విభాగంలో 115 మందికి గాను 106 మంది హాజరయ్యారని, 9 మంది పరీక్ష రాయలేదని అధికారులు వెల్లడించారు.
NGKL: జిల్లాలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అమ్రాబాద్‌లోని దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం. కృష్ణానదిని ఆనుకొని కొల్లాపూర్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో అక్కమహాదేవి గుహలు ఉన్నాయి. లొద్ది మల్లయ్య ఆలయం మన్ననూర్ చెక్ పోస్ట్ తెలంగాణ అమర్నాథ్ గుహగా పిలువబడే ప్రదేశంలో ఆరు జలపాతాలు, గుహలో శివలింగం ఉంది.
MBNR: మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీలో HDYకి చెందిన ఓ సంస్థ గురువారం నిర్వహించిన ప్రాంగణ ఎంపీకలలో 9 మంది ఎంపికైనట్టు యూనివర్సిటీ ఉపసంచాలకులు జి.ఎన్.శ్రీనివాస్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా వి.సీ మాట్లాడుతూ.. ఎంపికైన సంస్థలో బాధ్యతగా పనిచేసి యూనివర్సిటీ పేరు నిలబెట్టాలన్నారు. ఎంపికైన వారికి ప్రోహిబిషన్‌లో జీతం రూ. 1.8 లక్షలు ఉంటుందన్నారు.
ADB: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అన్ని ఆశ్రమ పాఠశాలలో నిర్వహించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్ ఆదేశించారు. గురువారం ఉట్నూర్‌లోని క్యాంపు కార్యాలయంలో డీటీడీఓ, ఏటీడీవోలు, హెచ్‌డబ్ల్యుఓల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99పై సమావేశం నిర్వహించారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల కార్యచరణపై కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.
ADB: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అన్ని ఆశ్రమ పాఠశాలలో నిర్వహించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్ ఆదేశించారు. గురువారం ఉట్నూర్‌లోని క్యాంపు కార్యాలయంలో డీటీడీఓ, ఏటీడీవోలు, హెచ్‌డబ్ల్యుఓల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99పై సమావేశం నిర్వహించారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల కార్యచరణపై కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.
SRD: రాయికోడ్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తు గడువును మార్చి 10వ తేదీ వరకు పొడిగించినట్లు రాయికోడ్ MEO జీ. నర్సింలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అయన సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
WNP: రాజ్యసభ సభ్యుడిగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరును AICC ఖరారు చేసింది. ఈ క్రమంలో గురువారం అసెంబ్లీ సెక్రటరీ వేం నరేందర్ రెడ్డి తన నామినేషన్ సమర్పించారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, pcc ప్రెసిడెంట్, మంత్రులు, MLA లతో కలిసి వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి పాల్గొని ఆయనకు అభినందనలు తెలియజేశారు.
MHBD: సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఆయన తన రాజీనామా లేఖను CSకు సమర్పించారు. అనంతరం హైదరాబాదులో రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కేసముద్రం మండలానికి చెందిన నేతకు ఈ అరుదైన అవకాశం దక్కడంతో ఉమ్మడి జిల్లాలో సంబరాలు హోరేత్తాయి.