• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వసంతపూర్లో గ్రామసభ కార్యక్రమం

NGKL: బిజినేపల్లి మండలం వసంతపూర్ గ్రామంలో ఈ రోజు ఉదయం సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ నిర్వహించారు. ఈ గ్రామసభలో గ్రామంలో ఏ ఏ పనులు పెండింగ్లో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ పనులన్నీ త్వరలోనే పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్, పంచాయతీ కార్యదర్శి భూపతి, ప్రజలు పాల్గొన్నారు.

March 5, 2026 / 11:35 AM IST

కాండం తొలుచు పురుగు నివారణపై అవగాహన

SDPT: వరి పంటలను నష్టపరుస్తున్న కాండం తొలుచు పురుగు నివారణపై సిరిసిల్ల బాలు జర్మీనన్ రామ్ అగ్రికల్చరల్ కళాశాల విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించారు. ఇవాళ సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్‌లో క్షేత్రస్థాయిలో వరి పంటలను పరిశీలించారు. అధిక నత్రజని ఎరువుల వినియోగాన్ని నివారించి క్రమం తప్పకుండా పొలాలను పరిశీలించి పురుగు ఉద్ధృతిని తగ్గించుకోవడానికి గల సలహాలు, సూచనలు చేశారు.

March 5, 2026 / 11:32 AM IST

ఎల్లుండి నుంచే లింగమంతుల జాతర.. చరిత్ర ఇదే

NLG: నిడమనూరు మండం ఎర్రబెల్లి సమీపంలోని గుట్టపై కొలువైన లింగమంతుల స్వామికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. పార్వతీదేవిని వివాహమాడేందుకు శివుడు ఇక్కడ స్వామి రూపంలో వెలిశాడని భక్తుల నమ్మకం. చెంచు వనిత అయిన మాణిక్యాలదేవిని పెళ్లాడేందుకు స్వామి మాయోపాయంతో ఆమెను ఒప్పించి కళ్యాణం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఏటా ఈ కొండ వద్ద జాతర నిర్వహిస్తున్నారు.

March 5, 2026 / 11:32 AM IST

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

NZB: బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామంలో ఉపాధి హామీ (NREGS) నిధులతో నూతన సీసీ రోడ్డు పనులను సర్పంచ్ మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో రూ.5 లక్షల నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వార్డు సభ్యులు, గ్రామ కమిటీ ప్రతినిధులు,గ్రామస్థులు పాల్గొని పనులను పర్యవేక్షించారు.

March 5, 2026 / 11:31 AM IST

HYDలో వరుస ప్రమాదాలు.. జర జాగ్రత్త!

HYD: వరుసగా సంభవిస్తున్న ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. గత 2 నెలల్లో పదుల సంఖ్యలో అగ్నిప్రమాదాలు జరగడం పట్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. బాచుపల్లి ఘటన మరవక ముందే కాటేదాన్‌లో మంటలు చెలరేగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున అగ్నిప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉందని హైడ్రా, అగ్నిమాపక బృందాలు హెచ్చరిస్తున్నాయి.

March 5, 2026 / 11:30 AM IST

సెయింట్ ఆన్స్‌లో పోలీస్ జాగృతి కళాబృందం ప్రదర్శనలు

HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని కాజీపేట పట్టణం సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో నేడు పోలీస్ జాగృతి కళాబృందం సభ్యులు మూఢ నమ్మకాలు, యువత దురాలవాట్లపై సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ఎస్సై యాదగిరి గౌడ్ జాగృతి కళాబృందం ప్రదర్శనలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

March 5, 2026 / 11:30 AM IST

దేవరకద్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో గత 5 రోజులుగా.. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేవరకద్రలో 38.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. చిన్నచింతకుంట 38.3, భూత్పూర్ 38.2, కోయిలకొండ మండలం పారుపల్లి 38.1, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 37.7, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

March 5, 2026 / 11:25 AM IST

తాటికల్ హైస్కూల్ విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

NLG: నకిరేకల్ మండలం తాటికల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులను గుర్తించి కళ్ళజోడు అందజేస్తామని డాక్టర్ శైలజ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ HM ప్రజ్ఞాపురం వెంకన్న, క్యాంపు కోఆర్డినేటర్ లతీఫ్, వైద్య సిబ్బంది సరిత, ఉపాధ్యాయులు పండుగ తిరుమలయ్య, మార్త రాములు పాల్గొన్నారు.

March 5, 2026 / 11:23 AM IST

విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి

SRD: విద్యుత్ ప్రమాదంలో ఓ రైతు మృతి చెందిన సంఘటన కంగ్టి మండలం చాప్ట బి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బాలాజీ రావు పాటిల్ గురువారం ఉదయం తన పొలానికి వెళ్లగా, అక్కడ చేనుకు ఉన్న కంచెకు కరెంటు షాక్ తగిలి మృతి చెందినట్లు తెలిపారు. ఈయన మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 5, 2026 / 11:22 AM IST

రూ.10 వేల నజరానా.. ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా

JN: జనగామ జిల్లాలోని పలు గ్రామాలు స్వచ్ఛంద మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. బచ్చన్నపేట మండలం కొడవటూర్, చిన్నరామన్ చర్ల, లింగంపల్లి, రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్లో మద్యపాన నిషేధ తీర్మానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే తీర్మానాన్ని ఉల్లంఘించి మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా, తాగిన వారిని, అమ్మిన వారిని పట్టిస్తే రూ.10 వేలు నజరానా ఇస్తారు.

March 5, 2026 / 11:20 AM IST

సర్పంచ్ భర్తపై వేడినీళ్లతో దాడి

KMM: కారేపల్లి మండలంలోని గేట్‌ రేలకాయలపల్లిలో హోలీ వేడుకల వేళ విషాదం చోటుచేసుకుంది. సర్పంచ్ కేలోత్ మంగ భర్త బన్సీపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వేడినీళ్లు పోసి దాడికి పాల్పడ్డారు.హోలీ ఆడుదామని పిలిచి ఈ అమానుషానికి ఒడిగట్టారు. గాయపడిన బన్సీని స్థానికులు ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని డాక్టర్స్ తెలిపారు.

March 5, 2026 / 11:19 AM IST

‘పేద ప్రజల ఆత్మగౌరమే ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం’

NGKL: పేద ప్రజల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని నడింపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

March 5, 2026 / 11:12 AM IST

రామాయంపేటలో రేషన్ కష్టాలు

MDK: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పథకం అమలులో జాప్యం జరుగుతుండటంతో మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఐదారు నెలలుగా ఎఫ్‌సీఐ (FCI) గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా సకాలంలో కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.​ ప్రతి నెల 1వ తారీఖున అందాల్సిన బియ్యం, 7వ తారీఖు దాటినా అందడంలేదన్నారు.

March 5, 2026 / 11:11 AM IST

‘ఎఫ్ఎల్ఎస్ పరీక్షను బాగా రాయాలి’

MNCL: ఎఫ్ఎల్ఎస్ పరీక్షను విద్యార్థులు బాగా రాయాలని లక్షెట్టిపేట మండల ఎంఈఓ శైలజ సూచించారు. గురువారం లక్షెట్టిపేట్ మండలంలోని ఉత్కూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థుల ప్రగతిని పరిశీలించి ఎంఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. మార్చిలో నిర్వహించే ఎఫ్ఎల్ఏస్ ఎగ్జామ్‌కు విద్యార్థులను సంసిద్ధులను చేయాలని ఉపాధ్యాయులను ఆమె ఆదేశించారు.

March 5, 2026 / 11:08 AM IST

అడుగంటుతున్న జలాలు… ఎండుతున్న పొలాలు

BHNG: గుండాల మండలంలో రైతులు సాగు చేసిన వరి పొలాలు నీరందక ఎండి పోతున్నాయి. రోజురోజుకూ ముదురుతున్న ఎండలకు బావులు, బోర్లలో నీటి ఊట తగ్గి రైతులు వేసిన వరి పొలాలు ఎండి పోతున్నాయి. బిక్కేరు వాగులలో ఇసుకను యథేచ్ఛగా తోడుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి నీటి ఊట తగ్గి బావులు, బోర్లు ఒట్టి పోతున్నట్లు రైతులు వాపోతున్నారు.

March 5, 2026 / 11:06 AM IST