• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఉప్పల్ అసెంబ్లీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ ఎక్కడ..?

MDCL: ఉప్పల్ అసెంబ్లీ పరిధిలో ఎక్కడా ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ జరిగినట్లు కనిపించడం లేదని పలువురు ఓటర్లు తెలిపారు. ఉప్పల్, మల్లాపూర్, కుషాయిగూడ, రామంతపూర్, హబ్సిగూడ ప్రాంతాల్లో ఓటర్ నమోదు అధికారులు తమ ఇంటి వద్దకు రాలేదని అనేక మంది చెబుతున్నారు. మేడ్చల్ జిల్లాలోని అత్యంత ఆలస్యంగా ఈ ప్రక్రియ సాగుతున్నట్లు ఇటీవల ఓ ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 1, 2026 / 12:23 PM IST

పేదల ఇళ్లను కూల్చడమేనా ప్రజాపాలన అంటే?

KMM: ప్రజా పాలన అంటూ చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఇళ్లను కూల్చడం దుర్మార్గమని అఖిలపక్ష పార్టీల జిల్లా నాయకులు నాగేశ్వరరావు, ప్రకాష్ అన్నారు. ఆదివారం కారేపల్లిలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పైసా పైసా కూడా పెట్టి కట్టుకున్న ఇంటిని కూల్చడం సరికాదన్నారు. బాధితులకు న్యాయం చేయాలన్నారు.

March 1, 2026 / 12:21 PM IST

జిల్లాకు చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

KMM: మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖమ్మం చేరుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో ఆయనకు శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు గోంగూర వెంకటేశ్వర్లుతో పాటు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన వాజ్ పేయి శత జయంతి వేడుకలకు హాజరుకానున్నారు.

March 1, 2026 / 12:20 PM IST

ఘనంగా అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమం

JGL: గొల్లపల్లి మండల కేంద్రంలో అంబేడ్కర్ నామస్మరణ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సామాజిక కార్యకర్త గంగాధర మధుసూదన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు సీనియర్ న్యాయవాది తాండ్ర సురేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాయవాదులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు.

March 1, 2026 / 12:14 PM IST

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నాయకులు

KMM: ఖమ్మం వెలుగుమట్ల పేద ప్రజల ఇండ్లను కూల్చడమేనా ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రజా పాలన అని అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో కారేపల్లి మండల కేంద్రంలో నిరసన తెలిపారు. అలాగే ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాయ కష్టం చేసి లక్షలాది రూపాయలు అప్పు చేసి పేద ప్రజలు భూములు కొని ఇళ్లు నిర్మించుకుంటే దయాదాక్షణ్యం లేకుండా ఈ ప్రభుత్వం కూలగొడుతుందా అనే ప్రశ్నించారు.

March 1, 2026 / 12:11 PM IST

మార్కెట్ కమిటీ డైరెక్టర్‌కు సన్మానం

RR: శంకర్‌పల్లి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతన డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన భాస్కర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు రఘునందన్ రెడ్డి, రవీందర్, రవి శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భాస్కర్ రెడ్డి అన్నారు.

March 1, 2026 / 12:11 PM IST

చేర్యాలలో సిండికేట్ మాయాజాలం!

SDPT: చేర్యాల మండల కేంద్రంలో మద్యం సిండికేట్ ఆగడాలు మితిమీరుతున్నాయి. గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో విక్రయించే మద్యం సీసాలపై సిండికేట్ స్టిక్కర్లు దర్శనమిస్తుండటం కలకలం రేపుతోంది. అధిక ధరలకు విక్రయిస్తూ సామాన్యులను దోచుకుంటున్నా, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

March 1, 2026 / 12:07 PM IST

TMCE&WU రాష్ట్ర కార్యదర్శిగా తోట రామాంజనేయులు

KMM: తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (TMCE&WU) రాష్ట్ర కార్యదర్శిగా ఖమ్మం జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి తోట రామాంజనేయులును వరంగల్‌లో రాష్ట్ర నాలుగో మహాసభలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రామాంజనేయులు మాట్లాడుతూ.. తనను ఎన్నుకున్న నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

March 1, 2026 / 12:06 PM IST

సెంట్రల్ లైటింగ్ పునరుద్ధరణ పనులు

SRPT: మునగాల మండలం ముకుందాపురం వద్ద జాతీయ రహదారి 65పై నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పునరుద్ధరణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా లైట్లు వెలగకపోవడంతో వాహనదారులు, రోడ్డు దాటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామస్థులు అథారిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు సిబ్బందిని పంపి మరమ్మతులు చేపట్టారు.

March 1, 2026 / 12:05 PM IST

సికింద్రాబాద్ నుంచి హోలీ కోసం ప్రత్యేక రైళ్లు

HYD: హోలీ పండుగ నేపథ్యంలో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక రైళ్లలో ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ నుంచి నహరిగన్ సహా ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ఉన్నాయని Rail One యాప్ ద్వారా చూసుకునే వెసులుబాటు కల్పించినట్లుగా పేర్కొన్నారు.

March 1, 2026 / 12:02 PM IST

కుక్కకాటుపై ఆందోళన వద్దు: డీఎంహెచ్‌వో

ఖమ్మం జిల్లాలో కుక్కకాటు ఘటనల నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామారావు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా టీకాలు, మందులు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చారు. ముజుగూడెం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఒకరిని ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి తరలించామని తెలిపారు.

March 1, 2026 / 12:02 PM IST

దారప్ప చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం జగ్గారం పంచాయతీలో వాడే దారప్పచెరువును ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఈరోజు స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. ఆ చెరువు మరమ్మతులు చేయాలని రైతులు కోరగా ఆ చెరువు నిండా గుర్రపు డెక్కఆకుతో నిండిపోయి ఉంది. దీంతో కింద ఉన్న వరి పొలాలకు రెండు పంటలకు నీరు అందే విధంగా సహకరించాలని స్థానిక రైతు కారం శ్రీరాములు ఎమ్మెల్యేకు వివరించారు.

March 1, 2026 / 12:00 PM IST

యావపూర్‌లో స్వచ్ఛభారత్

MDK: తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. ఆదివారం యావపూర్ సర్పంచ్ యంజాల స్వామి ఆధ్వర్యంలో యువకులు చీపుర్లు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు. వీధులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామని సర్పంచ్ స్వామి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.

March 1, 2026 / 11:57 AM IST

నిరాటంకంగా ఇసుక అక్రమ రవాణా

JGL: జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గతంలో ట్రాక్టర్లకే పరిమితమైన ఈ దందా,ఇప్పుడు లారీలు, టిప్పర్లలో బహిరంగంగానే సాగుతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రకృతి సంపదను తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.తనిఖీల్లో వాహనాలు పట్టుబడుతున్నా అక్రమార్కుల తీరు మారడం లేదని, అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలన్నరు.

March 1, 2026 / 11:56 AM IST

జిమ్ లో లవ్.. పెళ్లికి నిరాకరణ!

SRD: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్పూర్‌కు చెందిన యువతికి, మయూరినగర్ నివాసి అరవింద్‌కు జిమ్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. యువతి వివాహం చేసుకోవాలని కోరగా అతను నిరాకరించి దూరం పెడుతున్నాడని, తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది.

March 1, 2026 / 11:55 AM IST