KMM: మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖమ్మం చేరుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్లో ఆయనకు శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు గోంగూర వెంకటేశ్వర్లుతో పాటు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన వాజ్ పేయి శత జయంతి వేడుకలకు హాజరుకానున్నారు.