• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

NLG: కేతేపల్లి మండలం బండపాలెం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి, భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆలయ పురోగతికి సహకారం అందిస్తామన్నారు.

March 1, 2026 / 03:00 PM IST

ఉప్పల్‌లో 19 మందిపై కేసులు నమోదు..!

MDCL: ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపుగా వారం రోజుల పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలలో మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని అదుపులోకి తీసుకుని, వాహనాలు సైతం సీజ్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు.

March 1, 2026 / 02:57 PM IST

రేపటి నుంచి యధావిధిగా ప్రజావాణి

MDK: మెదక్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రేపు యధావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని ప్రజల సద్వినియోగం చేసుకోవాలనీ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులందరూ సమయపాలనతో తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలన్నారు.

March 1, 2026 / 02:49 PM IST

వికారాబాద్‌కు రేపు VVIPలు.. ట్రాఫిక్ డైవర్షన్స్

SRD: రేపు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి తదితర ప్రముఖులు పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ను మళ్లించినట్లు ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. వికారాబాద్ నుంచి తాండూర్‌కు అనంతగిరి గుట్ట మార్గంలో వచ్చే వాహనాలు బుగ్గ రామలింగేశ్వర స్వామి రోడ్డు, మెరినాట్స్ మీదుగా జైదుపల్లికి వెళ్లే రోడ్డు ద్వారా రాకపోకలు కొనసాగించాలని సూచించారు.

March 1, 2026 / 02:48 PM IST

నందిమేడారంలో సోలార్ పనులపై మంత్రి సమీక్ష

 PDPL: ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో సోలార్ ప్యానళ్ల ఏర్పాటు పనులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి ఇంటికి సోలార్ సదుపాయం అందేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సోలార్ వినియోగంతో విద్యుత్ ఖర్చు తగ్గి గ్రామం స్వయం సమృద్ధిగా మారుతుందని మంత్రి పేర్కొన్నారు.

March 1, 2026 / 02:45 PM IST

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన బీమ్ భరత్

RR: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరిందని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ భీమ్ భరత్ అన్నారు. ఇవాళ శంకర్ పల్లి మండల పరిధిలో దోబీపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లును ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి, వార్డ్ మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

March 1, 2026 / 02:43 PM IST

‘లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం’

KMR: బీర్కూరు మున్నూరు కాపు సంఘ భవనంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ మాట్లాడుతూ.. ప్రాణాపాయంలో ఉన్నవారిని ఆదుకునేందుకు రక్తదానం మిన్న అని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు సామాజిక సేవలో ముందుండటం అభినందనీయమని కొనియాడారు.

March 1, 2026 / 02:36 PM IST

ప్రత్యేక విజన్ తో ముందుకు వెళ్తున్నాం: MLA

HNK: వర్ధన్నపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక విజన్‌తో ముందుకు వెళ్తున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ వివేక్ నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల గౌరవం పెంచే విధంగా పనిచేస్తునని తెలిపారు. గతంలో పోలీస్ అధికారిగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తున్నానన్నారు.

March 1, 2026 / 02:34 PM IST

రేపు బోధన్ 15వ వార్డులో కుస్తీ పోటీలు

NZB: బోధన్ పట్టణంలోని 15వ వార్డులో హోలీ పండుగ పురస్కరించుకొని కుస్తీ పోటీలకు రంగం సిద్ధమైందని కౌన్సిలర్ అశోక్ రెడ్డి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రసిద్ధ మల్లయోధులు ఈ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.

March 1, 2026 / 02:33 PM IST

కళ్యాణ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NGKL: కళ్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ క్యాంపు కార్యాలయంలో తిమ్మాజీపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు ఆదివారం చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

March 1, 2026 / 02:33 PM IST

‘న్యాయవాదులు సేవా భావం పెంచుకోవాలి’

NLG: నల్గొండలో న్యాయవాద పరిషత్తు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. జిల్లా అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు జాతీయ అధ్యక్షులు విష్ణుమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. న్యాయవాదులు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని, యువ న్యాయవాదులు నిరంతరం అధ్యయనం చేస్తూ సేవాభావం పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

March 1, 2026 / 02:33 PM IST

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తున్నాం: మంత్రి

MLG: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ పేదవారి కలలను సాకారం చేస్తున్నామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని SLN గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టిఎస్ తో కలిసి కొండాయి గ్రామానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు.

March 1, 2026 / 02:33 PM IST

మాదిగ అమరవీరులకు నివాళులర్పించిన MRPS నేతలు

MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఆదివారం SC వర్గీకరణ పోరులో ప్రాణాలర్పించిన అమరవీరులకు MRPS నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా MRPS మండల అధ్యక్షుడు వెంకన్న మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం నాటి నుంచి కొనసాగిన ఉద్యమం సాధించిన ఫలితాలను గుర్తుచేశారు.

March 1, 2026 / 02:32 PM IST

కదిరేపాడులో కొత్త విద్యుత్ ఫీడర్ ప్రారంభం

WNP: రాజాపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని కదిరేపాడులో నూతన విద్యుత్ ఫీడర్‌ను సర్పంచ్ గ్రామ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఇంతకుముందు పలు తండాలు, గ్రామాలకు ఒకే ఫీడర్ ఉండటంతో లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తేవని తెలిపారు. కొత్త ఫీడర్‌తో రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించి సాగులో ఇబ్బందులు తగ్గుతాయని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

March 1, 2026 / 02:32 PM IST

సనాతన హిందూ ఉత్సవ సమితిలో చేరికలు

ADB: హిందూ సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయడమే సనాతన హిందూ ఉత్సవ సమితి లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి తెలిపారు. ఆదివారం గోపాలకృష్ణ మఠంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మహిళలు సమితిలో చేరారు. పట్టణంలో తమ సమితి ఒక్కటే ఉందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. అనంతరం నూతన సభ్యులకు కాషాయ కండువాలు కప్పి ఆహ్వానించారు.

March 1, 2026 / 02:30 PM IST