• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘బంధం కుంట చెరువు హద్దులను ఫిక్స్ చేయండి’

MDCL: గాజులరామారం పరిధి బంధం కుంట చెరువు ఒక్షిత్ వ్యూ హిల్స్ కాలనీ ప్రాంతాల్లో సైబరాబాద్ కమిషనర్ శ్రీజన విస్తృతంగా పర్యటించారు. ముఖ్యంగా వర్షపు నీటి సమస్యపై ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ చేసిన కమిషనర్, ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల సమన్వయంతో చెరువు హద్దులను ఫిక్స్ చేయాలని ఆదేశించారు. అంతేకాక చెరువు పరిసర ప్రాంతాల్లో గార్బేజి కనిపించకుండా చూడాలన్నారు.

March 17, 2026 / 08:48 PM IST

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు: సీపీఎం

VKB: గ్రామపంచాయతీ కార్మికుల ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడి సందర్భంగా సీపీఎం నాయకుల ముందస్తు అరెస్టులను జిల్లా ప్రధాన కార్యదర్శి మైపాల్ ఖండించారు. అక్రమ అరెస్టులతో పోరాటాలను ఆపలేరన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులకు పనికి తగ్గ వేతనం చెల్లించి, వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

March 17, 2026 / 08:47 PM IST

ఆశ్రమంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

KNR: కిసాన్ నగర్‌లోని ప్రభుత్వ వృద్ధుల, దివ్యాంగుల ఆశ్రమాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వృద్ధుల నివాస గదులను, వంటగది, తాగునీటి వసతి, టాయిలెట్స్ పరిశీలించారు. గీజర్, శుద్ధ జల యంత్రాల పనితీరును పరిశీలించారు. అనంతరం వృద్ధులు, దివ్యాంగులతో ముచ్చటించారు. భోజనం ఎలా ఉంటుందని, రుచిగా వండుతున్నారని తెలుసుకున్నారు.

March 17, 2026 / 08:46 PM IST

‘మాదకద్రవ్యాల బారిన పడకుండా నిఘా ఉండాలి’

WNP: జిల్లాలోని విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో నార్కోటిక్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నిర్మాణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

March 17, 2026 / 08:46 PM IST

పిల్లలు పంతులుగా మారిన రోజు

WGL: నల్లబెల్లి (M) లోని పంతులుపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలనా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హెడ్‌మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి, ఉపాధ్యాయుడు కూనమళ్ల రాజన్ బాబు మార్గదర్శకత్వంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారారు. ఈ కార్యక్రమంలో రాధారపు శివాని హెడ్‌మాస్టర్‌గా, ఎర్ర లాస్య సర్పంచ్‌గా, బైరి ప్రసన్న ఏఏపీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

March 17, 2026 / 08:46 PM IST

ఘనంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

MDK: తూప్రాన్‌లో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులు ఓడి బియ్యం సమర్పించారు. తుమ్మెద శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణంలో మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు జింక మల్లేష్, నాగరాజుగౌడ్, దీపక్ రెడ్డి, మహేష్ యాదవ్, నాగేష్ పాల్గొన్నారు.

March 17, 2026 / 08:45 PM IST

సత్తుపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవి

KMM: సత్తుపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కూకలకుంట రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సాధు కృష్ణయ్య, కోశాధికారిగా కేశవరెడ్డితో పాటు పలువురు ఇతర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కొత్త కార్యవర్గం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏడాది పాటు విధుల్లో కొనసాగనుంది.

March 17, 2026 / 08:45 PM IST

రేపు బంజపల్లిలో తైబజార్ వేలం పాట

KMR: నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తైబజార్ వేలం పాట రేపు ఉదయం 10:30 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సర్పంచ్ ఆలే సుగుణమ్మ అధ్యక్షతనలో జరుగుతుంది. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అధికారులు కోరుతున్నారు.

March 17, 2026 / 08:42 PM IST

రంజాన్ కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

RR: చేవెళ్ల నియోజకవర్గం నవాబుపేట్ మండల కేంద్రంలో ప్రభుత్వం తరఫున మైనారిటీ సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ సోదరులకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు.

March 17, 2026 / 08:41 PM IST

తాగునీటితో ఫ్లోర్ కడిగినందుకు.. రూ.5వేలు ఫైన్

HYDలో తాగునీటి దుర్వినియోగంపై HMWSSB కఠిన చర్యలు చేపట్టింది. జూబ్లీహిల్స్‌లో ఓ నివాసి తాగు నీటితో ఫ్లోర్లు కడుగుతూ ఉండగా గుర్తించి రూ.5,000 జరిమానా విధించారు. ప్రజల నుంచి వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తాగునీటిని వృథా చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.

March 17, 2026 / 08:40 PM IST

‘విద్యా సంస్థలు శక్తి సంరక్షణలో ముందుండాలి’

WGL: విద్యా సంస్థలు శక్తి సంరక్షణలో ముందుండాలని NIT వరంగల్ డైరెక్టర్ సుబుధి ఉద్యోగులకు సూచించారు. WGL జిల్లా కేంద్రంలోని NIT ఆవరణలో ఉద్యోగుల కోసం నిర్వహించిన ‘ఎనర్జీ సేవింగ్ అవేర్‌నెస్ & ట్రైనింగ్ ప్రోగ్రామ్’ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మౌలిక వసతుల సమర్థ వినియోగం ద్వారా విద్యుత్ ఆదా చేయవచ్చని తెలిపారు.

March 17, 2026 / 08:40 PM IST

హామీలు నెరవేర్చాలని ధర్నా

JGL: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మెట్‌పల్లి పట్టణంలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ ఇప్పటివరకు పూర్తిగా అమలు కాలేదని బీజేపీ నాయకులు విమర్శించారు. హామీలను వెంటనే అమలు చేయాలని వారు తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.

March 17, 2026 / 08:39 PM IST

బ్రతికి ఉండగానే మరణించినట్టు నమోదు

SRCL: కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన వృద్ధురాలు మాదాసు నరసవ్వ బ్రతికి ఉండగానే అధికారులు రికార్డులలో మరణించినట్టు నమోదు చేశారు. అధికారులకు పలమార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని వృద్ధురాలు వాపోయారు. కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే రికార్డుల్లో మరణించినట్టు ఉండటం వల్ల పెన్షన్ రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

March 17, 2026 / 08:38 PM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి పొంగులేటి

KMM: హైదరాబాద్‌ బషీర్ బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో నిర్వహించిన ‘దావత్-ఏ-ఇఫ్తార్’ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సెక్యులర్ పార్టీ అని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం సర్వమతాల ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

March 17, 2026 / 08:32 PM IST

అక్షర చిట్ ఫండ్ MD పేరాల శ్రీనివాస్ అరెస్ట్: SP

ADB: అక్షర చిట్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్, వందల సంఖ్యలో బాధితులను మోసం చేసిన ఘరానా మోసగాడు పేరాల శ్రీనివాసరావును అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 12 కేసులు నమోదు చేసినట్లు SP అఖిల్ మహాజన్ మంగళవారం తెలిపారు. నిందితుడు గత 6 నెలలుగా తప్పించుకుంటూ తిరుగుతూ.. సోమవారం పట్టుబడినట్లు వెల్లడించారు. ప్రైవేట్ చిట్ ఫండ్స్ పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.

March 17, 2026 / 08:31 PM IST