• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మళ్లాలి: శిరీష

NGKL: పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామంలో మంగళవారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ శిరీష పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు సేంద్రియ పద్ధతులను అనుసరించవలసిన అవసరాన్ని, ప్రకృతి వ్యవసాయం ప్రజల సంక్షేమానికి ఉపకరిస్తుందని వివరించారు. నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, జీవామృతం వంటి కషాయాల తయారీ విధానాలను రైతులకు వివరించారు.

March 17, 2026 / 07:27 PM IST

మంత్రి పొంగులేటిని కలిసిన ఎమ్మెల్యే రేవూరి

HNK: ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కలిశారు. పరకాల నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను మంత్రికి ఎమ్మెల్యే వివరించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజిరెడ్డి పాల్గొన్నారు.

March 17, 2026 / 07:26 PM IST

MPDO కార్యాలయం ఎదుట నిరసన

HNK: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన VB జీరామ్ జీ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ MPDO కార్యాలయం ముందు DBF ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. DBF రాజేందర్ మాట్లాడుతూ.. కొత్త చట్టంలోని నిబంధనల వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం MPDO కార్యాలయంలో సూపర్డెంట్‌కు వినతిపత్రం అందజేశారు.

March 17, 2026 / 07:26 PM IST

రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: AO

MHBD: రైతు భరోసా పథకం 2025-26 యాసంగి సీజన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గూడూరు మండల AO అబ్దుల్ మాలిక్ తెలిపారు. గత నెల 28 లోపు డిజిటల్ సంతకం అయిన రైతులు మాత్రమే ఈసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో రైతు భరోసా పథకం లబ్ధి పొందిన రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. మరిన్ని వివరాలకు AO కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

March 17, 2026 / 07:25 PM IST

603 మంది ఉద్యోగాలకు ఎంపిక

NZB: టీయూలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ ఫెయిర్లో 603 మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఆఫర్ లెటర్స్ అందజేసినట్లు ప్లేస్ మెంట్ సెల్ డైరెక్టర్ డా.పాత నాగరాజు తెలిపారు. ఆన్‌లైన్‌లో 1,470 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 1,255 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యా రు. అందులో 603 మంది మొదటి దశలో ఎంపిక కాగా మరో 25 మంది 2వ దశకు ఎంపికైనట్లు చెప్పారు.

March 17, 2026 / 07:20 PM IST

జిల్లాలో తనిఖీలు.. 6 సిలిండర్లు స్వాధీనం

BHPL: జిల్లాలోని వివిధ బేకరీలు, చికెన్ సెంటర్లపై సివిల్ సప్లై ఇన్‌స్పెక్టర్ ఇవాళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గృహ వినియోగానికి కేటాయించిన ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 6 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య వంటలకు వాడటం చట్ట విరుద్ధమని అన్నారు.

March 17, 2026 / 07:18 PM IST

దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: రాణాప్రతాప్

WGL: దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా.గోగుల రాణాప్రతాప్ తెలిపారు. నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం దుర్గమ్మ తల్లి గుడిపండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, నాయకుల ఆహ్వానం మేరకు రాణాప్రతాప్ ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసారు.

March 17, 2026 / 07:18 PM IST

అశ్రునయనాల మధ్య మాజీ ఎమ్మెల్యే అంత్యక్రియలు

MNCL: దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామ శివారులో అశ్రునయనాల మధ్య మాజీ ఎమ్మెల్యే గోవింద నాయక్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్‌ను చివరిసారి చూసేందుకు ప్రముఖులు తరలివచ్చి నివాళులు అర్పించారు. అంతిమ యాత్రను నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, అనిల్ జాదవ్, తదితరులు ఉన్నారు.

March 17, 2026 / 07:17 PM IST

మున్సిపల్ కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

KMM: సత్తుపల్లి మున్సిపల్ కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ స్వయంగా కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించారు. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం, వైద్య సేవలు అందించిన డాక్టర్లకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.

March 17, 2026 / 07:17 PM IST

‘దళారులను నమ్మి మోసపోవద్దు’

PDPL: జిల్లా ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మధ్య దళారుల మాటలు నమ్మి, ప్రజలు మోసపోవద్దని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ సూచించారు. ఈ ఉద్యోగాల నియామకాలు కలెక్టర్ నేతృత్వంలోని వారధి సొసైటీ ద్వారా మాత్రమే జరుగుతాయని తెలిపారు. కావున ఉద్యోగం కావాలనుకునే ప్రజలు వారధి సొసైటీలో పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

March 17, 2026 / 07:15 PM IST

ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని వినతి

JN: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కోరుతూ లింగాల గణపురం తహసీల్దార్ కు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు సంపత్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ వెంటనే అమలు చేసి ప్రజాసంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

March 17, 2026 / 07:12 PM IST

‘అధికారుల సమన్వయంతో ప్రమాదాలు నివారించాలి’

KNR: వివిధ శాఖల అధికారులు సమన్వయంతో రోడ్డు భద్రతా చర్యలు తీసుకుంటూ ప్రమాదాలు నివారించాలని, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. ప్రమాదాలు జరిగే చోట్లను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.

March 17, 2026 / 07:11 PM IST

శ్రీరామనవమి ఉత్సవాలపై సమీక్షించిన కలెక్టర్

BDK: జిల్లా కలెక్టర్ అంకిత్ శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, రవాణా సౌకర్యాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏరియా ఆసుపత్రిలో 30 ప్రత్యేక పడకలను అందుబాటులో ఉంచాలని, ఐటీసీ (ITC) ఆధ్వర్యంలోని బ్రిడ్జ్ లైటింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

March 17, 2026 / 07:07 PM IST

ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా

MDCL: ప్రగతినగర్‌లో 9 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా రక్షణ కల్పించింది. అంబీర్ చెరువుకు ఆనుకుని ఉన్న 5 ఎకరాల స్మశానవాటిక, పక్కనే ఉన్న 4 ఎకరాల డంపింగ్ యార్డు స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయనే ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూకట్‌పల్లి మండలం బాగామేరి గ్రామం సర్వే నం.103లో ఉన్న ఈ భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు.

March 17, 2026 / 07:07 PM IST

టీకా నిల్వ కేంద్రాల తనిఖీ

KMM: చింతకాని, బోనకల్, మధిరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ రమణ మంగళవారం తనిఖీ చేశారు. టీకాల నిల్వ ఉష్ణోగ్రతలు, రికార్డులను పరిశీలించి కోల్డ్ చైన్ నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం మధిర ఆసుపత్రిలో హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 ఏళ్ల లోపు బాలికలకు ఈ టీకా వేయించాలని కోరారు.

March 17, 2026 / 07:05 PM IST