MNCL: దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామ శివారులో అశ్రునయనాల మధ్య మాజీ ఎమ్మెల్యే గోవింద నాయక్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్‌ను చివరిసారి చూసేందుకు ప్రముఖులు తరలివచ్చి నివాళులు అర్పించారు. అంతిమ యాత్రను నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, అనిల్ జాదవ్, తదితరులు ఉన్నారు.