ADB: అక్షర చిట్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్, వందల సంఖ్యలో బాధితులను మోసం చేసిన ఘరానా మోసగాడు పేరాల శ్రీనివాసరావును అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో 12 కేసులు నమోదు చేసినట్లు SP అఖిల్ మహాజన్ మంగళవారం తెలిపారు. నిందితుడు గత 6 నెలలుగా తప్పించుకుంటూ తిరుగుతూ.. సోమవారం పట్టుబడినట్లు వెల్లడించారు. ప్రైవేట్ చిట్ ఫండ్స్ పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.