HYDలో తాగునీటి దుర్వినియోగంపై HMWSSB కఠిన చర్యలు చేపట్టింది. జూబ్లీహిల్స్లో ఓ నివాసి తాగు నీటితో ఫ్లోర్లు కడుగుతూ ఉండగా గుర్తించి రూ.5,000 జరిమానా విధించారు. ప్రజల నుంచి వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తాగునీటిని వృథా చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.