WGL: కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని BJP నర్సంపేట పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్ డిమాండ్ చేసారు. బీజేపీ రాష్ట్రశాఖ పిలుపుమేరకు మంగళవారం నర్సంపేట MRO కార్యాలయం ఇన్ఛార్జ్ సినీయర్ అసిస్టెంట్ సాయికృష్ణకు నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వం త్వరగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే BJP ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామన్నారు.