MDK: తూప్రాన్‌లో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులు ఓడి బియ్యం సమర్పించారు. తుమ్మెద శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణంలో మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు జింక మల్లేష్, నాగరాజుగౌడ్, దీపక్ రెడ్డి, మహేష్ యాదవ్, నాగేష్ పాల్గొన్నారు.