WGL: విద్యా సంస్థలు శక్తి సంరక్షణలో ముందుండాలని NIT వరంగల్ డైరెక్టర్ సుబుధి ఉద్యోగులకు సూచించారు. WGL జిల్లా కేంద్రంలోని NIT ఆవరణలో ఉద్యోగుల కోసం నిర్వహించిన ‘ఎనర్జీ సేవింగ్ అవేర్నెస్ & ట్రైనింగ్ ప్రోగ్రామ్’ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మౌలిక వసతుల సమర్థ వినియోగం ద్వారా విద్యుత్ ఆదా చేయవచ్చని తెలిపారు.