WNP: జిల్లాలోని విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నార్కోటిక్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నిర్మాణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.