• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఖమ్మం నుంచి వాడపల్లికి ప్రత్యేక బస్సు ఏర్పాటు

KMM: ఖమ్మం డిపో నుంచి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు ఖమ్మం డీఎం శివప్రసాద్ తెలిపారు. ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి బయలుదేరే ఈ బస్సు శనివారం తెల్లవారుజామున 2 గంటలకు వాడపల్లి చేరుకుంటుంది. ఈ సర్వీసుకు పెద్దలకు రూ. 900, పిల్లలకు రూ. 470గా రాను-పోను చార్జీ నిర్ణయించారు.

March 17, 2026 / 09:37 AM IST

రేపు ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం

KMM: ఖమ్మం నగర పాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నారు. అనివార్య కారణాలతో మంగళవారం జరగాల్సిన ఈ భేటీ వాయిదా పడింది. సుమారు రూ. 196.40 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు వార్షిక బడ్జెట్‌ను సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన ప్రతులను అధికారులు ఇప్పటికే కార్పొరేటర్లకు అందజేశారు.

March 17, 2026 / 09:30 AM IST

పాలమూరు యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఎ కన్వెన్షన్

MBNR: పాలమూరు యూనివర్సిటీలో 17, 18 తేదీల్లో ఎస్ఎఫ్ఎ రాష్ట్ర యూనివర్సిటీ కన్వెన్షన్ జరుగనుంది. యూనివర్సిటీ అధ్యక్షుడు రాజేష్, కార్యదర్శి రాము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ప్రతినిధులు విశ్వవిద్యాలయ సమస్యలు, రీసెర్చ్ ఫెలోషిప్లు, నిధుల పెంపు, ఫ్యాకల్టీ నియామకాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారు.

March 17, 2026 / 09:27 AM IST

ప్రజాసంఘాల నాయకుల ముందస్తు అరెస్ట్

NGKL: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఛలో హైదరాబాద్ కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో అచ్చంపేట పోలీసులు పలువురు ప్రజాసంఘాల నాయకులను మంగళవారం అరెస్టు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు నిర్మలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌‌కు తరలించారు.

March 17, 2026 / 09:25 AM IST

ఎస్సీ యువతకు ఉపాధి అవకాశం: కలెక్టర్

NRPT: నారాయణపేట్ మండలంలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పథకంలో భాగంగా 2 వీలర్ 90 శాతం, 3 వీలర్‌కు 70 శాతం సబ్సిడీ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ వెల్లడించారు. 

March 17, 2026 / 09:25 AM IST

పశువులకు గాలికుంటు నివారణ

KNR: రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని సర్పంచ్ వెల్మ బలరాం రెడ్డి సూచించారు. మంగళవారం పెగడపల్లి మండలం మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన ఉచిత టీకాల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పశువులకు టీకాలు వేశారు.

March 17, 2026 / 09:25 AM IST

“వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి”

JN: జఫర్‌గఢ్ మండలం నుంచి సాగరం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో వాహనాదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలు కనబడక ప్రమాదాలకు గురవుతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలన్నారు.

March 17, 2026 / 09:22 AM IST

‘నేడు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం’

KMM: కామేపల్లి మండల పరిధిలోని కామేపల్లి, పాత లింగాల, కొమ్మినేపల్లి రైతు వేదికలలో మంగళవారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి బి. తారా దేవి తెలిపారు. పంటల సాగులో డ్రోన్ వినియోగం, ప్రకృతి వ్యవసాయంపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించి చైతన్య పరుస్తారన్నారు.

March 17, 2026 / 09:22 AM IST

జిల్లాలో గ్యాస్ కొరత లేదు: సప్లై అధికారి

MLG: జిల్లాలో వంట గ్యాస్ (LPG)కొరత ఏర్పడలేదని జిల్లా సివిల్ సప్లై అధికారి షా ఫైజల్ హుస్సేని స్పష్టం చేశారు. ఈనెల 15న ఒక్క రోజే 1155 సిలిండర్లను వినియోగదారులకు అందజేశామని వెల్లడించారు. సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సరఫరాలో సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 18004257109కి సంప్రదించాలని సూచించారు.

March 17, 2026 / 09:15 AM IST

ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

గద్వాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు మైనర్ విద్యార్థులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయిజ పట్టణానికి చెందిన రాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు విద్యార్థులు విష్ణు, వర్ధన్ తీవ్రంగా గాయపడ్డారు.

March 17, 2026 / 09:15 AM IST

మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందులు

RR: రంజాన్ మాసం సందర్భంగా ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు నిన్న సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. మతసామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు నిలుస్తాయని.. కుల, మత భేదాలు లేకుండా ప్రతిఒక్కరూ ఇఫ్తార్ విందులో పాల్గొంటారన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

March 17, 2026 / 09:14 AM IST

వరుస దొంగతనాలు.. నిందితుడి అరెస్ట్

ADB: వరస దొంగతనాలకు పాల్పడుతున్న అందారే సిద్దేశ్వర్ అనే నిందితుడిని ఉట్నూర్ మండలంలోని బస్టాండ్ సమీపంలో సోమవారం పట్టుకున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు. పట్టణంలో జరిగిన కొన్ని కీలక కేసులలో నేరస్తుడుగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు మూడు దొంగతనాల కేసుల్లో నగదు కాజేసినట్లు పేర్కొన్నారు. ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లు నరేష్, తానాజీ, ప్రేమ్, తదితరులు ఉన్నారు.

March 17, 2026 / 09:07 AM IST

సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: కలెక్టర్

VKB: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, సీసీ రోడ్లు, డ్వాక్రా భవనాలను, పంచాయతీ భవనాలను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీ దీపక్ తివారీ అధికారులకు సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్‌లో ఆయా నిర్మాణాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 12,860 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, 8,560 ఇళ్ల శంకుస్థాపన ప్రారంభమైందన్నారు.

March 17, 2026 / 09:07 AM IST

కొత్తపల్లి SHOగా సోహం సునీల్

KNR: కొత్తపల్లి మండల పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్.హెచ్.ఓ)గా 2023 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి సోహం సునీల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయి పోలీసు యంత్రాంగం పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కోసం ఆయనను ఇక్కడ నియమించారు. రానున్న 3 నెలల పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.

March 17, 2026 / 09:06 AM IST

ఎస్సీ నిరుద్యోగులకు సబ్సిడీ పై వేకిల్స్

BHNG: SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వీలర్‌కు 90%, 3 వీలర్‌కు 70% సబ్సిడీతో EV’s కొనుగోలుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆదాయ, కుల, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. అన్‌లైన్ లోని tgobmms.cgg.gov.in లింక్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

March 17, 2026 / 09:04 AM IST