• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ఠాను నాయక్ విగ్రహం ఏర్పాటు చేయాలి’

BDK: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఠాను నాయక్ విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని జేఏసీ ఛైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ అన్నారు. కొత్తగూడెం మేయర్ గణేష్‌ను కోరారు. ఈనెల 20న ఠాను నాయక్ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తామని మేయర్ హామీ ఇచ్చారు.

March 17, 2026 / 10:33 AM IST

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ‘నేను డిన్నర్‌కు మాత్రమే వెళ్లాను’

RR: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ మరోసారి స్పందించారు. తాను కేవలం డిన్నర్‌కు మాత్రమే హాజరయ్యానని, ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో తన పేరు రావడంపై విచారం వ్యక్తం చేస్తూ, పోలీసుల విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని.. త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

March 17, 2026 / 10:33 AM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

ADB: ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో  విద్యార్థులు క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఆదివాసీ ఆహారపు ఉత్పత్తుల పరిశీలనలో భాగంగా ఎక్స్ రోడ్డులోని ఇప్పపువ్వు లడ్డు తయారీ కేంద్రాన్ని సందర్శించినట్లు ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. అధ్యాపకులు తిరుపతి ఆధ్వర్యంలో విద్యార్థులు తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

March 17, 2026 / 10:31 AM IST

క్రీడా పాఠశాల ప్రవేశాలకు విద్యార్థుల ఎంపిక

NRML: ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు అంబాజీ తెలిపారు. మంగళవారం దిలావర్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఎంపిక నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తారని తెలిపారు.

March 17, 2026 / 10:30 AM IST

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: TUF

BHPL: ఉద్యమకారుల గుర్తింపుకు కమిటీ ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని TUF స్వాగతిస్తున్నట్లు BHPL జిల్లా ఉద్యమకారుడు జావేద్ ఖాన్ తెలిపారు. ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న విద్యార్థి నాయకులు, పోరాట యోధులను అర్హులుగా గుర్తించాలని కోరారు. వారందరికీ పెన్షన్, హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలు కేటాయించి గౌరవించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

March 17, 2026 / 10:29 AM IST

స్వయం ఉపాధి కొరకు దరఖాస్తుల ఆహ్వానం

ASF: షెడ్యూల్డ్ కులాలకు చెందిన యువతీలు,యువకులు స్వయం ఉపాధి అవకాశాల కొరకు 2025-26 సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత మంగళవారం ప్రకటనలో తెలిపారు. రవాణా రంగంలో 2 వీలర్, 3 వీలర్ ఎలక్ట్రికల్ బైక్, వ్యవసాయ అనుబంధ రంగాలకు చేయూత అందించనున్నట్లు తెలిపారు. అర్హులు ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 17, 2026 / 10:29 AM IST

‘పశువులకు టీకాలు ఇప్పించాలి’

KMR: బిక్కనూర్ మండలం గురజాకుంటలో నేడు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ భరత్ కుమార్ పరిశీలించారు. పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి దేవేందర్, సర్పంచ్ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. పశువుల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు

March 17, 2026 / 10:28 AM IST

“ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి”

MLG: వెంకటాపురం మండలంలోని బస్టాండ్ సెంటర్‌లో సోమవారం సాయంత్రం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “ARRIVE AND ALIVE” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది, PACS మాజీ ఛైర్మన్ మోహన్ తదితరులు ఉన్నారు.

March 17, 2026 / 10:16 AM IST

బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు.. అర్చక సంఘం ఆగ్రహం

WNP: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలను జిల్లా అర్చక సంఘం అధ్యక్షుడు లక్ష్మీకాంత ఆచార్యులు ఖండించారు. దైవసేవలో ఉన్న వారిని రాజకీయాల్లోకి లాగడం సరికాదని, ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

March 17, 2026 / 10:13 AM IST

మహిళలకు చీరలు.. యువతులకు డ్రెస్సులు పంపిణీ

VKB: రంజాన్ సందర్భంగా మోమిన్‌పేట్ మండలం కోల్కొండ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి, కోల్కొండ సర్పంచ్ కర్ణం కీర్తి రామకృష్ణ మహిళలకు చీరలు, యువతులకు డ్రెస్సులు అందజేసి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరుణ రామకృష్ణ, ఉప సర్పంచ్ మహేందర్ రెడ్డి, గ్రామ పెద్దలు భుజంగం సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 10:10 AM IST

మినీ బస్సు బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు

HYD: మియాపూర్ పరిధిలో లీ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు బోల్తా పడింది. కూకట్‌పల్లి నుంచి 10 మంది ఉద్యోగులతో గడ్డపోతారం వెళ్తుండగా, బాచుపల్లి సమీపంలోని మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న పలువురు ఉద్యోగులకు స్వల్ప గాయాలవ్వగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

March 17, 2026 / 10:06 AM IST

నగరంలో మినీ బస్సు బోల్తా.. తీవ్ర గాయాలు

HYD: మియాపూర్ పరిధిలో లీ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు బోల్తా పడింది. కూకట్‌పల్లి నుంచి 10 మంది ఉద్యోగులతో గడ్డపోతారం వెళ్తుండగా, బాచుపల్లి సమీపంలోని మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న పలువురు ఉద్యోగులకు తీవ్ర గాయాలవ్వగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

March 17, 2026 / 10:06 AM IST

ధర్మారం వాసికి అంబేద్కర్ నేషనల్ అవార్డు

PDPL: ధర్మారం మండల కేంద్రానికి చెందిన సుంచు మల్లేశం తిరుపతిలో జరిగిన సౌత్ ఇండియా బహుజన రైటర్స్ 18వ కాన్ఫరెన్స్‌లో బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ మల్లేశంకు మెమొంటో, సర్టిఫికెట్ అందజేసి సన్మానించారు. బహుజన సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి అవార్డులు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

March 17, 2026 / 10:05 AM IST

‘అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలి’

ADB: అసాంఘిక కార్యకలాపాలపై 8712659973 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో SP అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. బాధితుల సమస్యలను పరిష్కరించినప్పుడు, సత్వర న్యాయం చేసినప్పుడు పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకం పెరుగుతుందని సూచించారు.

March 17, 2026 / 10:05 AM IST

ఉప సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపిన రజక సంఘం నేతలు

BHNG: చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం గ్రామ ఉపసర్పంచ్ బాతరాజు ధనంజయ జన్మదిన సందర్భంగా… వెలిమినేడు రజక సంఘం నాయకులు ఇవాళ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గోలి గణేష్, గోలి మహేష్, గోలి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 10:04 AM IST