• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

యూట్యూబర్ హత్య.. దర్యాప్తు ముమ్మరం

JGL: కోరుట్ల మండలం మాదాపూర్‌లో యూట్యూబర్ వైష్ణవిని, భర్త హరిబాబు చంపేసిన విషయం తెలిసిందే.. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ క్షణికావేశంలో హత్యకు దారి తీసింది. వైష్ణవి ప్రస్తుతం 4 నెలల గర్భిణి కావడంతో.. భార్యకు అండగా ఉండాల్సిన భర్త ఇలాంటి దారుణానికి ఒడిగట్టడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

March 17, 2026 / 11:00 AM IST

జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలో హెవీ ట్రాఫిక్

HYD: జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 92 బీవీబీ, జర్నలిస్ట్ కాలనీ నుంచి రోడ్ నంబర్ 45 వైపు భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. వాహనదారులు నెమ్మదిగా ముందుకు సాగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో వెళ్లేవారు ముందుగా ప్రణాళిక వేసుకోవాలని, వీలైతే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

March 17, 2026 / 11:00 AM IST

ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

ADB: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్డు భద్రత, సంబంధిత అంశాలపై ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు.

March 17, 2026 / 11:00 AM IST

యుద్ధం ఎఫెక్ట్.. ఉమ్మడి జిల్లాలో తగ్గిన కోడిగుడ్ల ధరలు..

WGL: యుద్ధం కారణంగా పౌల్ట్రీ ఎగుమతులు తగ్గిపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోడిగుడ్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. రెండేళ్ల క్రితం రైతులు హోల్‌సేల్‌గా రూ. 7 చొప్పున అమ్మేవారు. వినియోగదారులకు రూ. 7.50కు లభించేవి. ప్రస్తుతం ఎగుమతులు తగ్గడంతో హోల్‌సేల్ ధర రూ. 4.50కి దిగివచ్చింది. రిటైల్ మార్కెట్లో రూ. 5కు మాత్రమే లభిస్తున్నాయి.

March 17, 2026 / 10:56 AM IST

రైతు భరోసాలో బ్యాంకు అకౌంట్ మార్పుకు అవకాశం

SRD: సిర్గాపూర్ మండలంలోని రైతులకు రైతు భరోసా పథకంలో బ్యాంకు అకౌంట్ మార్చుకునే అవకాశం ఉందని ఎంఏవో హరికృష్ణ మంగళవారం తెలిపారు. ఈ పథకంలో అకౌంట్ మార్పు చేయాలనుకునే రైతులు సంబంధిత ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. నేడు, రేపు ఏఈవోలు అందుబాటులో ఉంటారని తెలిపారు. రైతులు రైతు భరోసా ఫారం, పట్టా పాసుబుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని రావాలని పేర్కొన్నారు.

March 17, 2026 / 10:52 AM IST

దొంగతనం కేసులో నిందితుడుకి రిమాండ్

ASF: సింగరేణికి సంబంధించిన ప్రాపర్టీని దొంగిలించిన కేసులో రెబ్బెన మండల కేంద్రానికి చెందిన చాపిడి మల్లేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI వెంకటకృష్ణ మంగళవారం తెలిపారు. మల్లేశ్ ఆదివారం గోలేటి CHPకి చెందిన ఇనుప సామాగ్రి దొంగిలించాడు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి కోర్టులో హాజరుపరిచామన్నారు.

March 17, 2026 / 10:50 AM IST

దొంగతనం కేసులో నిందితుడుకి రిమాండ్

ASF: సింగరేణికి సంబంధించిన ప్రాపర్టీని దొంగిలించిన కేసులో రెబ్బెన మండల కేంద్రానికి చెందిన చాపిడి మల్లేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI వెంకటకృష్ణ మంగళవారం తెలిపారు. మల్లేశ్ ఆదివారం గోలేటి CHPకి చెందిన ఇనుప సామాగ్రి దొంగిలించాడు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి కోర్టులో హాజరుపరిచామన్నారు.

March 17, 2026 / 10:50 AM IST

ప్రజల సమస్యలు తెలుసుకున్న మేయర్

MNCL: మంచిర్యాల ‘శుభ్రత-ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత’ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్‌లో మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్ డివిజన్‌లో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. అలాగే ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

March 17, 2026 / 10:50 AM IST

ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది: MLA

BDK: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన ఉండాల్సిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేడు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, అవి క్షేత్రస్థాయిలో అర్హులకు అందకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొందని వారు అన్నారు. ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని అన్నారు.

March 17, 2026 / 10:48 AM IST

బద్ది పోచమ్మ ఆలయంలో పోటెత్తిన భక్తులు

SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన వేములవాడలోని బద్ది పోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు బోనాలు సమర్పించేందుకు బారులు తీరారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. రాజరాజేశ్వర స్వామి వారి భక్తులు మంగళవారం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

March 17, 2026 / 10:45 AM IST

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10,250 కిట్లు పంపిణి..?

WGL: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులకు మొత్తం 10, 250 ‘ఈద్ కా తోఫా’ కిట్లు పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. జిల్లాల వారిగా వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌కు 3,000, హనుమకొండకు 2,500, జనగామకు 2,000, మహబూబాబాద్‌కు 1,250, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు 750 చొప్పున కిట్లు కేటాయించారు.

March 17, 2026 / 10:44 AM IST

అనారోగ్యంతో ప్రముఖ జర్నలిస్ట్ మృతి

SRPT: అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ గొల్ల నరేష్ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల స్థానికంగా విషాదం నెలకొంది. పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు.

March 17, 2026 / 10:42 AM IST

కోనాయిపల్లిలో ఉపాధి హామీ పనులు ప్రారంభం

SDPT: దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభించారు. ఈ పనులు గ్రామ అభివృద్ధికి, ప్రజలకు ఉపాధి కల్పనకు, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఏమహిపాల్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి మనోజ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పాల్గొన్నారు.

March 17, 2026 / 10:42 AM IST

రంజాన్ తోఫాను పంపిణీ చేసిన తహశీల్దార్

NRPT: మరికల్‌లో రంజాన్ పండుగను పురస్కరించుకొని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అందిస్తున్న ‘రంజాన్ తోఫా’ను తహశీల్దార్ రామకోటి, సర్పంచ్ చెన్నయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

March 17, 2026 / 10:35 AM IST

పాలిటెక్నిక్ కళాశాలలో రోటరాక్ట్ క్లబ్ ప్రారంభం

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం రోటరాక్ట్ క్లబ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీ రాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా 31 మంది విద్యార్థులకు ఈ బీసీ స్కాలర్‌‌షిప్‌లను అందజేశారు. ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున రూ. 3,10,000 అందజేశారు.

March 17, 2026 / 10:35 AM IST