WGL: యుద్ధం కారణంగా పౌల్ట్రీ ఎగుమతులు తగ్గిపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోడిగుడ్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. రెండేళ్ల క్రితం రైతులు హోల్‌సేల్‌గా రూ. 7 చొప్పున అమ్మేవారు. వినియోగదారులకు రూ. 7.50కు లభించేవి. ప్రస్తుతం ఎగుమతులు తగ్గడంతో హోల్‌సేల్ ధర రూ. 4.50కి దిగివచ్చింది. రిటైల్ మార్కెట్లో రూ. 5కు మాత్రమే లభిస్తున్నాయి.
SRD: సిర్గాపూర్ మండలంలోని రైతులకు రైతు భరోసా పథకంలో బ్యాంకు అకౌంట్ మార్చుకునే అవకాశం ఉందని ఎంఏవో హరికృష్ణ మంగళవారం తెలిపారు. ఈ పథకంలో అకౌంట్ మార్పు చేయాలనుకునే రైతులు సంబంధిత ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. నేడు, రేపు ఏఈవోలు అందుబాటులో ఉంటారని తెలిపారు. రైతులు రైతు భరోసా ఫారం, పట్టా పాసుబుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని రావాలని పేర్కొన్నారు.
ASF: సింగరేణికి సంబంధించిన ప్రాపర్టీని దొంగిలించిన కేసులో రెబ్బెన మండల కేంద్రానికి చెందిన చాపిడి మల్లేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI వెంకటకృష్ణ మంగళవారం తెలిపారు. మల్లేశ్ ఆదివారం గోలేటి CHPకి చెందిన ఇనుప సామాగ్రి దొంగిలించాడు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి కోర్టులో హాజరుపరిచామన్నారు.
ASF: సింగరేణికి సంబంధించిన ప్రాపర్టీని దొంగిలించిన కేసులో రెబ్బెన మండల కేంద్రానికి చెందిన చాపిడి మల్లేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI వెంకటకృష్ణ మంగళవారం తెలిపారు. మల్లేశ్ ఆదివారం గోలేటి CHPకి చెందిన ఇనుప సామాగ్రి దొంగిలించాడు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి కోర్టులో హాజరుపరిచామన్నారు.
MNCL: మంచిర్యాల ‘శుభ్రత-ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత’ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్‌లో మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్ డివిజన్‌లో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. అలాగే ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
BDK: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన ఉండాల్సిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేడు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, అవి క్షేత్రస్థాయిలో అర్హులకు అందకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొందని వారు అన్నారు. ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని అన్నారు.
SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన వేములవాడలోని బద్ది పోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు బోనాలు సమర్పించేందుకు బారులు తీరారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. రాజరాజేశ్వర స్వామి వారి భక్తులు మంగళవారం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
WGL: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులకు మొత్తం 10, 250 ‘ఈద్ కా తోఫా’ కిట్లు పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. జిల్లాల వారిగా వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌కు 3,000, హనుమకొండకు 2,500, జనగామకు 2,000, మహబూబాబాద్‌కు 1,250, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు 750 చొప్పున కిట్లు కేటాయించారు.
SRPT: అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ గొల్ల నరేష్ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల స్థానికంగా విషాదం నెలకొంది. పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు.
SDPT: దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభించారు. ఈ పనులు గ్రామ అభివృద్ధికి, ప్రజలకు ఉపాధి కల్పనకు, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఏమహిపాల్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి మనోజ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పాల్గొన్నారు.
NRPT: మరికల్‌లో రంజాన్ పండుగను పురస్కరించుకొని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అందిస్తున్న ‘రంజాన్ తోఫా’ను తహశీల్దార్ రామకోటి, సర్పంచ్ చెన్నయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం రోటరాక్ట్ క్లబ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీ రాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా 31 మంది విద్యార్థులకు ఈ బీసీ స్కాలర్‌షిప్‌లను అందజేశారు. ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున రూ. 3,10,000 అందజేశారు.
NGKL: కోడేరు మండలంలో ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమానికి వెళ్తున్న పారిశుద్ధ్య కార్మికులను మంగళవారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తమ వేతనాలను రూ.26,000కు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టులు చేయడం సరికాదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
KNR: తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. స్వామివారి కిరీటం, అమ్మవారి ఆభరణాలను అపహరించారు. వీటి విలువ సుమారు రూ. 10 లక్షలపైనే ఉంటుందని అర్చకులు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు.
MHBD: జిల్లా వేమునూరు గ్రామానికి చెందిన రాజు ఈ నెల 7న తన మొబైల్ ను పోగొట్టుకున్నాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ లొకేషన్ను గుర్తించారు. సోమవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో SI దీపికా రెడ్డి బాధితుడికి మొబైల్ ఫోన్‌ను అందజేశారు. ఈ సందర్భంగా పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.