RR: చేవెళ్ల మండలం గొల్లగూడ గ్రామంలో ఈ నెల 22, 23న శ్రీ సాందీప అచల ఋషి పరిపూర్ణ గురు మందిర 52వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గురు మందిర వ్యవస్థాపకులు దయానంద నాగుల వెంకటేశం, సర్పంచ్ నిర్మల నర్సింలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పూజ కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వానించారు.
NZB: నవీపేట్ మండలం కోస్లీలోని 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో మంగళవారం ఉదయం 8 గంటలకు ఎంవీఏ నూతన పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. విద్యుత్ శాఖ సిబ్బంది పర్యవేక్షణల ఈ పనులు చేపట్టారు. గ్రామ సర్పంచ్ బాబు సింగ్ పనులను స్వయంగా పరిశీలించారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్ అందుబాటులోకి రావడంతో చుట్టుపక్కల గ్రామాలకు విద్యుత్‌లో వోల్టేజీ సమస్య తీరుతుందని అధికారులు తెలిపారు.
KNR: ఇల్లందకుంట PHCలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ క్యాంపులో గర్భిణులు, చిన్నారులతో పాటు కంటి, దంత, ఎముకల సంబంధిత వ్యాధులకు నిపుణులైన వైద్యులు పరీక్షలు చేయనున్నారు.
MNCL: కాసిపేట మండలం కోమటిచెను సమీపంలో మంగళవారం బైక్ అదుపుతప్పి కింద పడటంతో బి.ప్రవీణ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బెల్లంపల్లి 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ERCP వైద్యుల సూచన మేరకు బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం రామకృష్ణాపూర్ సింగరేణి ఆస్పత్రికి తరలించారు.
SRPT: నడిగూడెం మండలంలోని కరివిరాల గ్రామానికి చెందిన ఉషారాణికి మంగళవారం కేంద్ర ప్రభుత్వ ‘పీఎం విశ్వకర్మ’ పథకం కింద టైలరింగ్ మెషిన్, టూల్ కిట్‌ను అందజేశారు. పోస్టల్ శాఖ ప్రతినిధి కావ్య, గ్రామ సమన్వయకర్త వంగూరు రమేష్ చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారురాలికి మండల బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి మేకల నాగరాజు అభినందనలు తెలిపారు.
JGL: హైదరాబాద్‌లో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కౌన్సిల్ ఛైర్‌పర్సన్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డా.కవితా రెడ్డిని వారి ఛాంబర్‌లో ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డా.మాకునూరు సంజయ్ కుమార్ కలిసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.
MDK: రాష్ట్రంలోని 5,008 అంగన్వాడీలను ‘సక్షం’ పథకంతో కేంద్రం ఆధునికీకరించనుంది. ఇందులో మెదక్ (130), సంగారెడ్డి (298) కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో డిజిటల్ విద్య కోసం LED స్క్రీన్లు, మెరుగైన మౌలిక వసతులు మరియు నాణ్యమైన పోషకాహారం అందనున్నాయి. ఈ మార్పులతో అంగన్వాడీలు కార్పొరేట్ తరహాలో బలోపేతం కానున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
KMR: గడిచిన 24 గంటల్లో జిల్లాలో అకాల వర్షం కారణంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన కురిసింది. అధికారిక వెల్లడి ప్రకారం.. మద్నూర్ మండలం సోమూరు 15.3మి.మీ, అత్య ధిక వర్షపాతం నమోదు కాగా, పాత రాజంపేట 12.8, భిక్కనూరు 8.5, జుక్కల్ 6.8, దోమకొండ 5.3, ఎల్పుగొండ 4.3మి.మీ లుగా వర్షపాతం నమోదైందని తెలిపారు.
KNR: కరీంనగర్ ఎస్ఈగా ఆర్. రవీందర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక్కడ ఎస్ఈగా పనిచేసిన మేక రమేష్ బాబు జనవరి 31న ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన వి. గంగాధర్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
MHBD: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు మండల SI గిరిధర్ రెడ్డి హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఇసుక రవాణాకు తహశీల్దార్ నుంచి అనుమతిపత్రం తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు.
MBNR: ప్రజా పాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మహిళా, శిశు సంక్షేమ శాఖ హెల్ప్ లైన్ పోస్టర్లను ఆవిష్కరించారు. 181, 1098 వంటి నంబర్లపై గ్రామ స్థాయి వరకు అవగాహన కల్పిస్తామని జిల్లా సంక్షేమ అధికారి జరీనా బేగం తెలిపారు. మహిళలు, పిల్లల భద్రత కోసం ప్రజలందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
SDPT: బెజ్జంకి మండలానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి వెళ్లే క్రమంలో పోలీసులు వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, నెలకు రూ.26,000 కనీస వేతనం ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు.
VKB: రోడ్డు గుంతలు పడి నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూడూరుకి వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలు పడి ప్రయాణం చేయలేని పరిస్థితి ఉందని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వెళ్లే వాహనదారులకు ప్రయాణం చేయలేని పరిస్థితి ఉందని వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రయాణ సౌకర్యం కల్పించాలని అధికారులను కోరుతున్నారు.
JN: స్టేషన్ ఘన్‌పూర్ నూతన తహసీల్దార్‌గా డొంకెన స్వప్న భాద్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎమ్మార్వోగా పనిచేసిన వెంకటేశ్వర్లు కలెక్టర్ కార్యాలానికి బదిలి కావడంతో నూతన ఎమ్మార్వోగా స్వప్న భాద్యతలు స్వీకరించారు. మండలంలోని రైతులకు సంబంధించి రెవిన్యూ పరమైన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
SRD: గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ సూరారంకు చెందిన అడవి వీరేష్ (45) మామిడి కాయలు తెంపేందుకు చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అంబులెన్స్‌లో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.