ADB: ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఆదివాసీ ఆహారపు ఉత్పత్తుల పరిశీలనలో భాగంగా ఎక్స్ రోడ్డులోని ఇప్పపువ్వు లడ్డు తయారీ కేంద్రాన్ని సందర్శించినట్లు ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. అధ్యాపకులు తిరుపతి ఆధ్వర్యంలో విద్యార్థులు తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.