NLG: చిట్యాల మండలం బొంగోని చెరువు గ్రామంలోని వార్డుల్లో మంగళవారం సీసీ రోడ్ల పనులను సర్పంచ్ కట్ట ఆశయ్య, ఉప సర్పంచ్ సామిడి సాయి కృష్ణారెడ్డి ప్రారంభించారు. గ్రామంలోని అన్ని వీధులను సీసీ రోడ్లుగా మార్చడమే కాకుండా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
GDWL: ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించడానికి బూత్ లెవల్ ఏజెంట్స్‌ను నియమించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం గద్వాల ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్ నందు SIR పురోగతిపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్ర చాలా ముఖ్యమని తెలిపారు.
MDK: చిన్న శంకరంపేట్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్‌తో కలిసి స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, వివిధ కేసుల్లో ఉన్న వాహనాల వివరాలను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డులను పరిశీలిస్తూ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరగాలని సూచించారు.
SRD: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ముస్లిం సిబ్బందికి మంగళవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర భావం, ఐక్యతకు ఇఫ్తార్ విందు నిదర్శనమన్నారు.
SRPT: జిల్లాలోని ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని DMHO డాక్టర్ వెంకటరమణ తెలిపారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చొరవతో రూ.15 లక్షలతో ఆధునిక వైద్య పరికరాలు సమకూర్చామన్నారు. ఫలితంగా నెలకు 4 ఉన్న ప్రసవాలు 12కు పెరిగాయని, మాతాశిశు సంరక్షణలో జిల్లా రాష్ట్రంలోనే ముందుందని ఆయన పేర్కొన్నారు.
MBNR: పట్టణ పరిధిలోని శ్రీనివాస్ కాలనీ పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని మంగళవారం కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మంగళవారం పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
BHPL: రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. SI సుధాకర్ వివరాల ప్రకారం.. కాల్వపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని సిద్దు ఎలాంటి చెల్లుబాటు అయ్యే అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
KNR: శంకరపట్నం మండలం లింగాపూర్‌లో సర్పంచ్ మొరే స్వరూప ఆధ్వర్యంలో సోమవారం ఉచితగాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని మొత్తం 330 పాడి పశువులకు టీకాలు వేసినట్లు పశువైద్యులు మాధవరావు తెలిపారు. పశువులలో సంక్రమించే వ్యాధులను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఉచిత టీకా కార్యక్రమాన్ని చేపట్టిందని, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NGKL: పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామంలో మంగళవారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ శిరీష పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు సేంద్రియ పద్ధతులను అనుసరించవలసిన అవసరాన్ని, ప్రకృతి వ్యవసాయం ప్రజల సంక్షేమానికి ఉపకరిస్తుందని వివరించారు. నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, జీవామృతం వంటి కషాయాల తయారీ విధానాలను రైతులకు వివరించారు.
HNK: ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కలిశారు. పరకాల నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను మంత్రికి ఎమ్మెల్యే వివరించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజిరెడ్డి పాల్గొన్నారు.
HNK: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన VB జీరామ్ జీ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ MPDO కార్యాలయం ముందు DBF ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. DBF రాజేందర్ మాట్లాడుతూ.. కొత్త చట్టంలోని నిబంధనల వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం MPDO కార్యాలయంలో సూపర్డెంట్‌కు వినతిపత్రం అందజేశారు.
MHBD: రైతు భరోసా పథకం 2025-26 యాసంగి సీజన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గూడూరు మండల AO అబ్దుల్ మాలిక్ తెలిపారు. గత నెల 28 లోపు డిజిటల్ సంతకం అయిన రైతులు మాత్రమే ఈసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో రైతు భరోసా పథకం లబ్ధి పొందిన రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. మరిన్ని వివరాలకు AO కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
NZB: టీయూలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ ఫెయిర్లో 603 మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఆఫర్ లెటర్స్ అందజేసినట్లు ప్లేస్ మెంట్ సెల్ డైరెక్టర్ డా.పాత నాగరాజు తెలిపారు. ఆన్‌లైన్‌లో 1,470 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 1,255 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యా రు. అందులో 603 మంది మొదటి దశలో ఎంపిక కాగా మరో 25 మంది 2వ దశకు ఎంపికైనట్లు చెప్పారు.
BHPL: జిల్లాలోని వివిధ బేకరీలు, చికెన్ సెంటర్లపై సివిల్ సప్లై ఇన్‌స్పెక్టర్ ఇవాళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గృహ వినియోగానికి కేటాయించిన ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 6 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య వంటలకు వాడటం చట్ట విరుద్ధమని అన్నారు.
WGL: దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా.గోగుల రాణాప్రతాప్ తెలిపారు. నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం దుర్గమ్మ తల్లి గుడిపండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, నాయకుల ఆహ్వానం మేరకు రాణాప్రతాప్ ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసారు.