• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి’

RR: హయత్ నగర్ డివిజన్‌లోని దత్తాత్రేయ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను తాజా మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన హయంలో మంజూరైన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వర్షాకాలానికి ముందుగానే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

March 17, 2026 / 08:05 PM IST

మంచన్పల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

VKB: పూడూర్ మండలం మంచన్పల్లిలో NREGS నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను సర్పంచ్ రాఘవేంద్రర్ ప్రారంభించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ K.సత్యనారాయణ రెడ్డి, D.చంద్రకళ, P. అంజమ్మ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు. మౌలిక వసతుల కల్పనే ధ్యేయమని వారు పేర్కొన్నారు.

March 17, 2026 / 08:05 PM IST

ఉత్తరం రాసి ప్రశంసలు అందుకున్న విద్యార్థిని

MDCL: అల్వాల్ మండలంలో విద్యార్థులకు ఉత్తరం రచనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్తరాల రాశారు. అలాగే మచ్చ బొల్లారం ప్రాథమిక స్కూల్ అమృత వర్షిణి అనే విద్యార్థిని ఎంఈవోకు ఉత్తరం తన సొంత మాటల్లో ఉత్తరం రాసింది. ఆమె రాసిన ఉత్తరం ఎంఈవోతో పాటు ఉపాధ్యాయులను ఆకట్టుకొని ప్రశంసలు అందుకుంది. భవిష్యత్తులో ఆమె ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు.

March 17, 2026 / 08:04 PM IST

బిచ్కుందలో 16 డొమెస్టిక్ సిలిండర్లు సీజ్

KMR: బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం ఉదయం నుంచి జిల్లా ఓఎన్డీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో డాబా, టీ పాయింట్, హోటలలో డొమెస్టిక్ సిలిండర్ వాడుతున్నట్టు సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 16 డొమెస్టిక్ సిలిండర్లు సీజ్ చేయడం జరిగిందన్నారు. ఎనిమిది మంది హోటల్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

March 17, 2026 / 08:01 PM IST

రాష్ట్ర స్థాయి క్రీడల్లో జోగుళాంబ జోన్ ‘క్లీన్ స్వీప్’

GDWL: రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో జోగుళాంబ జోన్ (Zone-Ull) అద్భుత ప్రదర్శన చేసింది. మొత్తం 40 పతకాలు సాధించి జోన్ సత్తా చాటింది. మంగళవారం మహబూబ్ నగర్‌లో విజేతలను జోన్ డీఐజీ ఎల్.ఎస్.చౌహన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎస్పీ శ్రీనివాసరావుతో పాటు ఉమ్మడి జిల్లా ఎస్పీలు, పోలీస్ అధికారులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.

March 17, 2026 / 08:00 PM IST

ఈనెల 25 వరకు దరఖాస్తుల స్వీకరణ

NZB: రైతు భరోసా పథకానికి ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సిరికొండ మండల వ్యవసాయ అధికారి నర్సయ్య తెలిపారు. రైతు భరోసా అప్లికేషన్ ఫారం, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలతో రైతు వేదికల్లో AEOకు ఇవ్వాలన్నారు. 28.02.2026 వరకు కొత్త పాసు పుస్తకం వచ్చిన రైతులు, ఇప్పటి వరకు రైతు భరోసా పొందని వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 17, 2026 / 08:00 PM IST

‘రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి’

NLG: గత నెల 28 వరకు కొత్తగా పట్టా పాస్‌బుక్ పొంది, డిజిటల్ సంతకం పూరైన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని చిట్యాల మండల వ్యవసాయ అధికారి గిరిబాబు తెలిపారు. అర్హులైన రైతులు పాస్‌బుక్, ఆధార్, బ్యాంక్ ఖాతా జిరాక్స్ ప్రతులను తమ ఏఈఓకు సమర్పించాలన్నారు. పాత లబ్ధిదారులు మళ్ళీ దరఖాస్తు చేయనక్కర్లేదని, ఈనెల 28 చివరి తేదీ అని తెలిపారు.

March 17, 2026 / 08:00 PM IST

రేపు తై బజార్ వేలం పాట

MDK: తూప్రాన్ మున్సిపల్ పరిధిలో 2026- 27 సంవత్సరానికి గాను తై బజార్ వేలం పాటలు బుధవారం ఉదయం 11 గంటలకు కార్యాలయంలో నిర్వహించనున్నట్లు కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వేలం పాటలలో పాల్గొనే వ్యక్తులు ఆస్తి పన్ను చెల్లించి ఉండాలని, తై బజార్ వేలం పాటలకు రూ. లక్ష ధరావత్, పశువుల సంత వేలం పాటలకు రూ. 50 వేలు ధరావత్ చెల్లించాలని సూచించారు.

March 17, 2026 / 08:00 PM IST

రామాపురం అభివృద్ధి నా ధ్యేయం: సర్పంచ్

SRPT: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేయించి నడిగూడెం మండలం రామాపురం గ్రామాన్ని మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ జరిగిన పంచాయతీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వార్డుల వారీగా సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 08:00 PM IST

ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు: SI

NRPT: యువకులు ర్యాష్ డ్రైవింగ్, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్సై కృష్ణచైతన్య హెచ్చరించారు. మంగళవారం నారాయణపేట పట్టణంలోని వీర సావర్కర్ చౌరస్తాలో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వాహనాలు నడిపించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పారు.

March 17, 2026 / 08:00 PM IST

‘జనాభా గణన సమర్థవంతంగా నిర్వహించాలి’

BHNG: జనాభా గణన-2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, ఛార్జ్ అధికారులు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మంగళవారం చివరి రోజు జనాభా గణన–సెన్సెస్ 2027కు సంబంధించి చార్జి అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని గణనను సమగ్రంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 08:00 PM IST

నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలి:ఎమ్మెల్యే

WNP: నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసి భవిష్యత్ తరానికి ఆదర్శంగా నిలవాలని మున్సిపల్ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సూచించారు. కొత్తకోట మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందిన ప్రజాప్రతినిధులు ప్రజలకు మంచి పనులు చేసి వారి అభిమానాన్ని చురగుంటే నాయకుని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

March 17, 2026 / 08:00 PM IST

ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా పంపిణీ

SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలో ముస్లింలకు ప్రభుత్వం అందించిన రంజాన్ తోఫా మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ శ్రీనివాసరావు పాటిల్, గ్రామ పెద్ద కళ్యాణ్ రావు పాటిల్ చేతులు మీదుగా ముస్లిం మహిళలకు తోఫా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇందులో సెక్రటరీ నవీన్ ఉన్నారు.

March 17, 2026 / 08:00 PM IST

‘స్నేహపూర్వక వాతావరణంలో పండగలు జరుపుకోవాలి’

MBNR: స్నేహపూర్వక వాతావరణంలో హిందూ ముస్లింలు పండగలు జరుపుకోవాలని మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో పార్టీ తరఫున ఇఫ్తార్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే ఉగాది రంజాన్ వేడుకలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మిథున్ రెడ్డి ఆనంద్ గౌడ్ కోత్వాల్, జహీర్ పాల్గొన్నారు.

March 17, 2026 / 08:00 PM IST

‘విశ్వకర్మ యోజనను సద్వినియోగం చేసుకోవాలి’

KNR: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకంను సద్వినియోగం చేసుకోవాలని, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం నగునూరులో లబ్దిదారులకు రూ. 15 వేల విలువ గల కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా 18 రకాల కుల వృత్తుల వారికి శిక్షణతో, సర్టిఫికెట్, రుణం ఇస్తుందన్నారు.

March 17, 2026 / 07:59 PM IST