NGKL: ఉన్నత చదువులు చదువుతున్న పేద విద్యార్థులకు అండగా ఉంటామని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. తాడూరు మండలం పర్వతాయపల్లికి చెందిన సాంబ కవిత అనే విద్యార్థిని ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఎమ్మెల్యే హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమెకు ల్యాప్ టాప్ అందజేశారు.
MDK: పశువులలో గాలికుంటు వ్యాధి రాకుండా ముందస్తుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీకాల కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య పేర్కొన్నారు. తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి టీకాలు పరిశీలించారు. రైతులు ఈ సదవకాశం వినియోగించుకోవాలని కోరారు. వ్యాధి సోకితే పశువుల నోట్లో పుండ్లు ఏర్పడతాయని వివరించారు.
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామికి మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో రూ.8,70,770, కార్ పార్కింగ్ రూ.1,96,500, VIP దర్శనాలతో రూ.2,10,000, బ్రేక్ దర్శనాలతో రూ.2,00,500, ప్రధాన బుకింగ్ రూ.1,49,790, లీజులతో రూ.8,01,871, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.27,74,928, ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు.
NRML: అసైన్డ్ భూముల్లో అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తే పట్టాలను రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. తానూర్ మండలంలో కొందరు లబ్ధిదారులు తమకు కేటాయించిన భూములను సాగు చేయకుండా మొరం వ్యాపారానికి వినియోగిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్టాలను ఇప్పటికే రద్దు చేసినట్లు మంగళవారం పేర్కొన్నారు.
WGL: జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ ఆదేశాల మేరకు మామునూరు, రామచంద్రాపురం, బొల్లికుంట గ్రామాల్లో న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించారు. ఇంటింటా ప్రచారం చేస్తూ వివిధ చట్టాలు, న్యాయ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సాయికుమార్ మాట్లాడుతూ.. న్యాయ సేవలను మారుమూల ప్రాంతాలకు విస్తరించడమే లక్ష్యమని అన్నారు.
RR: చేవెళ్ల మండలం హస్తేపూర్ గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశు వైద్యులు మాట్లాడుతూ.. పశువులలో ప్రాణాంతక గాలికుంటు వ్యాధిని నివారించడానికి ముందస్తు టీకాలు వేయించడం తప్పనిసరి అన్నారు. ఈ టీకాలు వేయడంతో పశువులకు రోదనిరోధక శక్తిని కల్పిస్తుందన్నారు.
BDK: ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో జరుగుతున్న పనులను DRDA విద్యా చందన సందర్శించారు. గ్రామంలో డ్రైన్‌లు, సోక్‌పిట్‌ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి, వాటి పురోగతిని సమీక్షించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, వర్షపు నీటి నిల్వలను నివారించడం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం కోసం ఈ పనులు అత్యంత కీలకమని అన్నారు.
ADB: విద్య ప్రతి ఒక్కరి భవిష్యత్తును మార్చగలదని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం సిరికొండ మండలం కుండగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలు నాటు వైద్యాన్ని నమ్మకుండా, ప్రభుత్వ ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ గంజాయి నిర్మూలనపై జిల్లా పోలీసులకు సహకరించాలని కోరారు.
RR: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 15,16వ వార్డుల్లో నిర్వహించిన శానిటేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. అనంతరం ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
PDPL: 2026 ఫిబ్రవరి 28లోపు వ్యవసాయ భూమికి పట్టాదారునిగా నమోదై పట్టా పాసు పుస్తకం కలిగిన వారు రైతు భరోసాకు ఈనెల 20 లోపు దరఖాస్తులు చేసుకోవాలని, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. క్లస్టర్ రైతు వేదికల్లో ఏఈవోలకు రైతు భరోసా దరఖాస్తు పత్రం, పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలు సమర్పించాలన్నారు.
BHPL: మల్హర్రావు మండలంలోని షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తోందని MPDO శ్రీరామ్ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి 23 వరకు అర్హత గల నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని MPDO సూచించారు.
MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల రైతు వేదికలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా రైతులకు మంగళవారం కిట్స్ పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ADA రాజానరేందర్ 125 మంది రైతులకు పెన్, నోట్ బుక్, క్యాప్ , క్లోత్ బ్యాగ్, క్యాలెండరు, కలిగిన కిట్‌లను అందజేశారు. కిట్లు పొందిన రైతులందరూ తప్పకుండ సహజ వ్యవసాయం చేయ్యాలన్నారు.
RR: హయత్ నగర్ డివిజన్‌లోని దత్తాత్రేయ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను తాజా మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన హయంలో మంజూరైన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వర్షాకాలానికి ముందుగానే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
VKB: పూడూర్ మండలం మంచన్పల్లిలో NREGS నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను సర్పంచ్ రాఘవేంద్రర్ ప్రారంభించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ K.సత్యనారాయణ రెడ్డి, D.చంద్రకళ, P. అంజమ్మ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు. మౌలిక వసతుల కల్పనే ధ్యేయమని వారు పేర్కొన్నారు.
MDCL: అల్వాల్ మండలంలో విద్యార్థులకు ఉత్తరం రచనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్తరాల రాశారు. అలాగే మచ్చ బొల్లారం ప్రాథమిక స్కూల్ అమృత వర్షిణి అనే విద్యార్థిని ఎంఈవోకు ఉత్తరం తన సొంత మాటల్లో ఉత్తరం రాసింది. ఆమె రాసిన ఉత్తరం ఎంఈవోతో పాటు ఉపాధ్యాయులను ఆకట్టుకొని ప్రశంసలు అందుకుంది. భవిష్యత్తులో ఆమె ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు.