గద్వాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు మైనర్ విద్యార్థులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయిజ పట్టణానికి చెందిన రాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు విద్యార్థులు విష్ణు, వర్ధన్ తీవ్రంగా గాయపడ్డారు.