VKB: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, సీసీ రోడ్లు, డ్వాక్రా భవనాలను, పంచాయతీ భవనాలను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీ దీపక్ తివారీ అధికారులకు సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్లో ఆయా నిర్మాణాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 12,860 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, 8,560 ఇళ్ల శంకుస్థాపన ప్రారంభమైందన్నారు.