• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మాజీ ఎమ్మెల్యేకు నివాళులర్పించిన జడ్పీ ఛైర్మన్

CTR: పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ భౌతిక కాయానికి జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు శనివారం నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. గొప్ప నాయకుడిని కోల్పోయామని వెల్లడించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

March 21, 2026 / 12:05 PM IST

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఐ, ఎస్సైలు

WNP: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా వనపర్తి సీఐ రత్నం, టౌన్ ఎస్సై హరి ప్రసాద్ ముస్లిం మైనార్టీ ప్రముఖులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి పట్టణం గోపాల్పేట రోడ్డులో రంజాన్ ప్రార్థన ముగించుకున్న అనంతరం విధుల్లో ఉన్న పోలీసు అధికారులను వనపర్తి మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు రహీం తదితరులు కలిశారు. ఈ నేపథ్యంలో వారు శుభాకాంక్షలు తెలిపారు.

March 21, 2026 / 12:05 PM IST

మండలిలో మంత్రి ఉత్తమ్ బడ్జెట్ .. జిల్లా వాసుల హర్షం

SRPT: శాసన మండలిలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టారు. వ్యవసాయం, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ రూపొందించిన ఈ బడ్జెట్ పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించడంతో హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

March 21, 2026 / 12:03 PM IST

ఐర్లాండ్‌తో టీ20లు.. షెడ్యూల్ విడుదల

ఐర్లాండ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడనున్నట్లు BCCI ప్రకటించింది. బెల్‌ఫాస్ట్ మైదానంలో జూన్ 26, 28 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటి వరకు భారత్ 2018, 2022, 2023 సంవత్సరాల్లో ఐర్లాండ్ టూర్‌కు వెళ్లింది. కానీ, బెల్‌ఫాస్ట్‌లో 2007 తర్వాత ఆడటం ఇదే మొదటిసారి అవుతుందని BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.

March 21, 2026 / 12:03 PM IST

కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు

KDP: వల్లూరు మండలం పుష్పగిరి పుణ్యక్షేత్ర సమీపంలో కామాక్షి అమ్మవారికి శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన తదితర పూజలు చేశారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు, పంచామృతాన్ని అందజేశారు.

March 21, 2026 / 12:02 PM IST

తిరుమలలో సరికొత్తగా CM చంద్రబాబు..!

TPT: తిరుమల పర్యటనలో ఎన్నడూ లేనివిధంగా సీఎం చంద్రబాబు సరికొత్తగా కనిపించారు. శ్రీవారి దర్శనం తర్వాత అన్నదానం కేంద్రానికి చేరుకుని భక్తులకు ఆయనే వడ్డించారు. తర్వాత ఆయన అక్కడే భోజనం చేశారు. తర్వాత బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడారు. ఓ చిన్నారిని ఎత్తుకుని లాలించారు. చంద్రబాబు సరికొత్తగా కనిపించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

March 21, 2026 / 12:01 PM IST

చందోలులో ఈద్గా వద్ద కట్టుదిట్టమైన భద్రత

BPT: రంజాన్ సందర్భంగా పిట్టలవానిపాలెం మండలం చందోలులోని ఈద్గా వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ప్రార్థనల దృష్ట్యా ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ప్రశాంతంగా పండగ జరుపుకోవాలని సూచించారు.

March 21, 2026 / 12:00 PM IST

ఉగాది పురస్కార గ్రహీతను అభినందించిన ఎమ్మెల్యే

కోనసీమ: కళలకు, సంప్రదాయాలకు కోనసీమ కాణాచి అని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరాభవ ఉగాది పురస్కారం అందుకున్న రావులపాలెంకు చెందిన వీర్నాల రమణబాబు శనివారం వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రమణబాబును ఎమ్మెల్యే ప్రశంసించి శాలువతో సత్కరించారు.

March 21, 2026 / 12:00 PM IST

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: బొడ్డు

KKD: ప్రజల సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని రుడా చైర్మన్, జిల్లా TDP ఇంచార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు. శనివారం రాజానగరం TDP కార్యాలయం వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. వాటిని అధికారుల దృష్టికి వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

March 21, 2026 / 12:00 PM IST

విద్యార్థికి లాప్‌టాప్ అందజేత

సత్యసాయి: పెనుకొండలో విద్యార్థుల ఉన్నత విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మంత్రి సవిత ఆదేశాల మేరకు SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ల్యాప్‌టాప్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పెనుకొండకి చెందిన రాము కుమారుడు హరీశ్‌కు ట్రస్ట్ డైరెక్టర్లు, నాయకులు శనివారం ల్యాప్‌టాప్‌ను అందజేశారు. హరీష్ అనంతపురంలోని అనంతలక్ష్మి కాలేజీలో బీటెక్ చదువుతున్నారు.

March 21, 2026 / 12:00 PM IST

మతిస్థిమితం లేని బాలికలపై అత్యాచారం

AP: విజయవాడ పటమట పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని ఇద్దరు బాలికలపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి బాలికలపై త్రినాథ్‌ అనే యువకుడు అత్యాచారం చేసినట్లు బాధితుల తల్లిదండ్రులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. త్రినాథ్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 21, 2026 / 11:59 AM IST

‘48% మందికే రుణమాఫీ.. దేవుళ్లపై ఒట్టు ఏమైంది?’

TG: రైతు రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్టు పెట్టిన CM రేవంత్, నేటికీ ఆ హామీని నెరవేర్చలేదని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్ధిపేట నియోజకవర్గంలో 22,819 మంది రైతులకు ఇంకా 300 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. కేవలం 48% మందికే రుణమాఫీ అయిందని, మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతులను నమ్మించి వంచించడం కాంగ్రెస్ మార్క్ రాజకీయం అని ఆయన ధ్వజమెత్తారు.

March 21, 2026 / 11:59 AM IST

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ

ELR: కైకలూరులో శనివారం రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే, వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మతసామరస్యానికి ప్రత్యేక రంజాన్ పండుగ అని సూచించారు.

March 21, 2026 / 11:59 AM IST

‘మాది శ్రమ ఫలితం.. మీది శిలాఫలకం’

TG: ‘మాది శ్రమ ఫలితం.. మీది కేవలం శిలాఫలకం’ అంటూ మాజీమంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నర్మెట్టలో మలేషియన్ టెక్నాలజీతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని BRS ప్రభుత్వమే తెచ్చిందని గుర్తు చేశారు. కాళేశ్వరం నీళ్లు రావడం వల్లే ఆయిల్ ఫామ్ సాగు పెరిగిందని, నాడు ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూసిన సీఎం రేవంత్, నేడు తాము చేసిన పనులకు రిబ్బన్లు కట్ చేస్తున్నారని విమర్శించారు.

March 21, 2026 / 11:54 AM IST

బరువు తగ్గాలంటే పుచ్చకాయ బెస్ట్

బరువు తగ్గాలనుకునే వారికి పుచ్చకాయ బెస్ట్ అని చెప్పాలి. ఇందులో 90% పైగా వాటర్ ఉంటుంది. దీనివల్ల శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అతిగా తినకుండా కంట్రోల్ చేయడంలో ఇది సహాయపడుతుంది. పుచ్చకాయ తింటే బరువు తగ్గొచ్చు. ఇందులోని ‘లైకోపీన్’ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.

March 21, 2026 / 11:52 AM IST