JN: నేటి సమాజంలో సోషల్ మీడియా పాత్ర కీలకమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంకు చెందిన సోషల్ మీడియా విభాగం నేతలు నేడు ఎర్రబెల్లిని కలిశారు. అనునిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు ఎర్రబెల్లి సూచించారు.
AP: ముస్లింలకు హోంమంత్రి అనిత రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో కూడిన ప్రార్థనలు పూర్తి చేసుకుని.. ఇవాళ భక్తిశ్రద్ధలతో ఈద్ జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. ఆ అల్లాహ్ కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
HYD: బీఆర్ఎస్ సీనియర్ నేత మధురానగర్ కాలనీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి మరణం చాలా బాధాకరమని ఎమ్మెల్యే మాగంటి సునీత అన్నారు. శనివారం ప్రతాప్‌రెడ్డి నివాసానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆమెతో పాటు స్థానిక నేతలు ఉన్నారు.
NZB: సిరికొండ మండలం శ్రీ శేష సాయి లక్ష్మీనారాయణ మందిరంలో నవగ్రహాల విగ్రహాల ప్రతిష్ఠాపన కోసం దాతలు ముందుకు వచ్చారు. దువ్వూరు లక్ష్మీనారాయణ రెడ్డి, అర్జున్ రెడ్డి కుటుంబ సభ్యులు కలిసి రూ.70 వేల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు శనివారం అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. దైవకార్యానికి ఆర్థిక సాయం అందించిన దాతల కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
NTR: నందిగామ ఈద్గా వద్ద రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ఈద్గా చేరుకుని ముస్లిం సోదరులు, సోదరీమణులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని, పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని షిప్కి లా కనుమ ద్వారా జూన్ 1 నుండి భారత్, చైనాల మధ్య వాణిజ్యం తిరిగి ప్రారంభం కానుంది. ఆరేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ వ్యాపారానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నమ్ గ్యా గ్రామంలో దుకాణాలు, గిడ్డంగులు నిర్మిస్తామని కిన్నౌర్ కలెక్టర్ తెలిపారు. సైన్యం, కస్టమ్స్ అధికారుల సహాయంతో ఈ ప్రక్రియ సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.
AP: ముస్లింలకు మంత్రి లోకేష్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘నెలవంక కనిపించింది.. నెలంతా కఠోర దీక్ష చేసిన ప్రతి మోము మురిసింది. ఉపవాస దీక్షతో పొందిన ఉపదేశం.. శాంతి, దానం ప్రతి మది నుంచి సమాజానికి చేరింది. రంజాన్ పండగ మీ కుటుంబాల్లో ఆనందాలు నింపాలని ఈద్ ముబారక్ తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.
KNR: చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బరిగెలపల్లిలో ముదిరాజ్ గ్రామశాఖ ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి ఆలయానికి శంకుస్థాపన జరిగింది. సర్పంచ్ సన్నీల్ల కవిత కొబ్బరికాయ కొట్టి భూమి పూజ నిర్వహించారు. ముదిరాజ్లు ఆలయ నిర్మాణాన్ని ఏడాది లోపు పూర్తి చేయడానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరారు.
WNP: మధుమేహం ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే కంటి రెటీనా దెబ్బతిని చూపుకోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మధుమేహ బాధితుల ఆరోగ్యం బాగు కోసం ‘దృష్టి’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్న వయసులోనే షుగర్, రెటినోపతి వంటి సమస్యలు వస్తున్నాయి అన్నారు. అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
సత్యసాయి: జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గ్యాస్ వినియోగంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ కొరత లేకుండా ఏజెన్సీలను నిరంతరం తనిఖీ చేయాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. వినియోగదారులు ఇండక్షన్ స్టవ్, సోలార్ సిస్టమ్ వైపు మొగ్గు చూపాలని సూచించారు. హోటళ్లకు గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
NRML: దండేపల్లి మండలంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. రంజాన్ సందర్భంలో తాళ్లపేట, మ్యాదరి పేట, నర్సాపూర్ రోడ్డులోని ఈద్‌గాహ్ వద్ద శనివారం ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. నమాజ్ అనంతరం ముస్లింలు కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. స్థానిక ప్రముఖులు వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
KNR: భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ సూచించారు. ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. స్వామివారి కళ్యాణం, బండ్లు, చిన్న రథం, పెద్ద రథోత్సవం, నఖబలి వంటి ప్రధాన ఘట్టాలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
MNCL: విద్యుత్ ప్రమాదాల నివారణకు NPDCL సంస్థ LC యాప్ అందుబాటులోకి తెచ్చినట్లు మంచిర్యాల SE రాజన్న ప్రకటనలో తెలిపారు. క్షేత్రస్థాయి విద్యుత్తు ఉద్యోగుల భద్రతే లక్ష్యంగా సంస్థ ప్రత్యేక యాప్ తెచ్చిందన్నారు. అత్యాధునిక, సాంకేతిక విధానంతో సిబ్బందికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇక నుంచి తప్పుడు ఫీడర్ల ఎంపిక, పంపిణీ వ్యవస్థపై అస్పష్టత సమస్యలు తలెత్తవన్నారు.
ADB: సోనాల మండలంలోని కొర్థ గ్రామానికి చెందిన వైద్యుడు అభిజిత్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ MP, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
కృష్ణా: ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే రాము రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను ముస్లింలందరూ ఆనందంగా జరుపుకుని అల్లాహ్ దీవెనలను అందుకోవాలని ఆకాంక్షించారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండగను ముస్లింలు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.