• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తెనాలి ఈద్గాలో నమాజ్ చేసిన మంత్రి నాదెండ్ల

GNTR: తెనాలి చెంచుపేట ఈద్గాలో నిర్వహించిన రంజాన్ ప్రార్థనల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేసిన ఆయన, అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కఠోర దీక్షల అనంతరం జరుపుకునే ఈ పండుగ అందరి ఇళ్లలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఈద్గా కమిటీ సేవలను అభినందించారు.

March 21, 2026 / 11:00 AM IST

రాఘవపురంలో శిలాఫలకం ధ్వంసం ..

SRPT: మోతే మండలం రాఘవపురం గ్రామంలోని గ్రామ పంచాయతీలో గుర్తుతెలియని వ్యక్తులు మొదటి పాలకవర్గ సభ్యుల శిలాఫలకాన్ని పగలగొట్టి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మాజీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని, పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను గ్రామస్థులు కోరారు.

March 21, 2026 / 10:58 AM IST

జీజీహెచ్‌లో వేధింపుల కలకలం..!

NLG: జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రక్షణ కరువైంది. ఎక్స్ రే విభాగంలో శిక్షణ పొందుతున్న ఓ పారామెడికల్ విద్యార్థినిపై అక్కడే అవుట్‌సోర్సింగ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు తెగబడుతున్నాడు. దీంతో నిందితుడి వేధింపులు మితిమీరడంతో భరించలేకపోయిన బాధితురాలు శనివారం ‘డయల్ 100’కు ఫిర్యాదు చేసింది.

March 21, 2026 / 10:57 AM IST

లక్ష లిల్లీ పుష్పాలతో భద్రకాళి అమ్మవారికి పూజలు

WGL: వసంత నవరాత్రుల రెండవ రోజు సందర్భంగా WGL జిల్లా కేంద్రంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు శేషు అమ్మవారిని విశేషంగా అలంకరించి.. లక్ష లిల్లీ పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. నేడు సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

March 21, 2026 / 10:56 AM IST

‘ధురంధర్’ తెలుగు షోలు షురూ

రణ్‌వీర్ సింగ్ నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. సెన్సార్ సమస్యలు, సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడిన షోలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రణ్‌వీర్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

March 21, 2026 / 10:55 AM IST

‘ధురంధర్-2’ తెలుగు షోలు షురూ

రణ్‌వీర్ సింగ్ నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. సెన్సార్ సమస్యలు, సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడిన షోలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రణ్‌వీర్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

March 21, 2026 / 10:55 AM IST

రాజంపేటలో ఘనంగా రంజాన్ వేడుకలు

అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని ఈద్గా మైదానంలో ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వారు ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్గా వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్బన్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

March 21, 2026 / 10:53 AM IST

పత్తి చేనులో పసికందు కలకలం

ASF: కాగజ్‌నగర్ మండలం వల్లగొండ గ్రామపంచాయతీ సీతానగర్ శివారులో పత్తి చేనులో పసికందును గుడ్డలో కట్టి పడేసిన ఘటన శనివారం వెలుగుచూసింది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శిశువును సురక్షితంగా బయటకు తీసి సంరక్షణలోకి తీసుకున్నారు. పాపను వదిలేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

March 21, 2026 / 10:53 AM IST

అమానుషం.. కాళ్లు, చేతులు కట్టేసి!

NLR:  జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఏపీ తీరంలోకి వచ్చిన తమిళనాడు బోట్లను మత్స్యకారులు పట్టుకొని జువ్వలదిన్నె హార్బర్ నిలిపారు. అయితే అల్లూరు మండలం ఇస్కపాలెంలోని పల్లి పాలేనికి చెందిన పెద్దకాపు వర్గం వీటిని విడుదల చేయించిందని సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన మత్స్యకారులు ఆ పెద్ద మనిషి, కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టి నిర్భంధించారని తెలుస్తోంది.

March 21, 2026 / 10:51 AM IST

రంజాన్ వేడుకల్లో ఎంపీ నాగరాజు

KRNL: రంజాన్ పండుగ సందర్భంగా నగరంలోని సంతోష్ నగర్ వద్ద ఉన్న ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలలో MP బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ముందుగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్ధనలు చేసిన ఎంపీ అనంతరం వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్నేహం, కరుణ, క్రమ శిక్షణ దయగుణాలకు రంజాన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు.

March 21, 2026 / 10:51 AM IST

పిల్లి కోసం ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య

HYD: నగరంలో పెంపుడు పిల్లుల విషయంలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. పిల్లిని ఇంట్లోకి తీసుకురావొద్దని తల్లి వాదించినందుకు అల్వాల్‌కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని శ్రేష్ఠ ఆత్మహత్యకు పాల్పడింది. మరో ఘటనలో.. మీర్పేట్‌కు చెందిన బీఎస్సీ విద్యార్థిని హిమబిందు తన పెంపుడు పిల్లి చనిపోయిందన్న బాధతో ప్రాణాలు తీసుకుంది.

March 21, 2026 / 10:49 AM IST

రంజాన్ వేడుకలలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య…

BHNG: ఆలేరు కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు శనివారం మిన్నంటాయి. వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయాన్నే స్థానిక ఈద్గా వద్దకు చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నలు, పెద్దలు ఒకేచోట చేరి భక్తిశ్రద్ధలతో నమాజ్ చేసి, ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు.

March 21, 2026 / 10:49 AM IST

రామాయంపేట ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు

MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టారు. శుక్రవారం రాత్రి నెలవంక దర్శనం ఇవ్వడంతో శనివారం రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. ఉదయం 9:30 నిమిషాలకు ఈద్గా వద్దకు చేరుకున్న ముస్లిం మైనార్టీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

March 21, 2026 / 10:46 AM IST

దారుణం.. లవర్‌పై కత్తితో దాడి

HYD: మియాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో అలీషా అలియాస్ పాండు తన తండ్రి లాలూతో కలిసి యువతిపై కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు నూకరత్నం (25)ను స్థానికులు వెంటనే గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 21, 2026 / 10:45 AM IST

పదో తరగతి పబ్లిక్ పరీక్షల రద్దుపై కమిషన్ క్లారిటీ

TG: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దు అని వస్తున్న వార్తలను విద్యాశాఖ కమిషన్ OSD జీనత్ ఖండించారు. తాము ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో రద్దు చేయాలనే ప్రతిపాదన చేయలేదన్నారు. కానీ, విడివిడిగా ఉన్న టెన్త్, ఇంటర్ బోర్డును విలీనం చేయాలని ప్రతిపాదించామన్నారు. 11వ తరగతి పబ్లిక్ పరీక్షలను మాత్రమే రద్దు చేయాలని సూచించామన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని సూచించారు.

March 21, 2026 / 10:45 AM IST