HYD: మియాపూర్లో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో అలీషా అలియాస్ పాండు తన తండ్రి లాలూతో కలిసి యువతిపై కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు నూకరత్నం (25)ను స్థానికులు వెంటనే గాంధీ హాస్పిటల్కు తరలించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.