TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో జీవన్ రెడ్డి సమావేశం కావాల్సి ఉండగా.. జగిత్యాలలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో BRS నేతలతో సరదాగా ముచ్చటించారు. అధిష్ఠానం నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని.. ఈనెల 25న భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది.
VZM: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతోందని బొబ్బిలి MLA బేబినాయన అన్నారు. శనివారం బొబ్బిలి కోటలో మాట్లాడుతూ.. మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో 50 వేలమందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రబుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 20 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, రెండో ఏడాది జాబ్ క్యాలెండ్ విడుదల చేశామన్నారు.
ASR: చింతపల్లిలో పెట్రోల్ కొరతతో బంకుల వద్ద వాహనదారులతో భారీ రద్దీ పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు, సరఫరా అంతరాయాలపై భయాందోళనల నేపథ్యంలో చింతపల్లి మండలంలోఇంధన సంక్షోభ వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం నుంచే మండల కేంద్రంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలు కూడా గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.
BDK: అశ్వాపురం మండలం మల్లెలమడుగు పంచాయతీ వైకుంఠధామంలో నీటి సమస్య ఉందని గ్రామస్థులు ఆవేదన ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచుకు తెలిపిన ఫలితం లేదన్నారు. అక్కడ బోరు ఉన్నప్పటికీ, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో నీరు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బొమ్మవతి బిక్షమమ్మ 11వ రోజు కర్మకాండల సమయంలో నీరు లేక గ్రామస్థులు వాగు వద్దకు వెళ్లాల్సి వచ్చింది.
KRNL: ఎమ్మిగనూరు, పవిత్రమైన రాంజాన్ పండుగను పురస్కరించుకుని ఎమ్మిగనూరు స్థానిక ఈద్గాలో ముస్లింలు సోదర, సోదరిమణులకు ఎమ్మెల్యే డాక్టర్ బివి.జయనాగేశ్వర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 30 రోజులు ఉపవాస దీక్షలు నిర్వహించి ఇవాళ ఈదుల్ ఫితర్ పండగ నిర్వహించుకోవడం శుభ పరిమాణమమని ఆయన పేర్కొన్నారు.
W.G: కృష్ణా జిల్లా తరిగొప్పుల రైల్వే స్టేషన్ ప్లాట్ఫారమ్ వద్ద గుర్తుతెలియని యువకుడు (సుమారు 25-30 ఏళ్లు) రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుని వివరాలు తెలిసిన వారు వెంటనే గుడివాడ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భీమవరం రైల్వే జీఆర్పి సుబ్రహ్మణ్యం కోరారు. మృతుని ఆచూకీ తెలిస్తే 92475 85713, 99890 29379 నెంబర్లను సంప్రదించాలని విన్నవించారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సింధు కాన్ఫరెన్స్ హాల్ వేదికగా ఈ నెల 22న ఉగాది పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మాతెలుగుతల్లి ఆధ్యాత్మిక సంస్థ ప్రతినిధి శ్రీనివాసయ్య తెలిపారు. ఈ ఉత్సవాలకు బెంగళూరు నుండి ప్రత్యేక అతిథులు విచ్చేస్తున్నారని, పాలమూరు జిల్లా వాసులు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
NDL: గిట్టుబాటు ధరలు లేక ఇప్పటికే నష్టాల్లో ఉన్న అరటి రైతులను అకాల వర్షం మరింత కుదిపేసింది. మండలంలోని చిన్న వంగలి గ్రామంలో ఈదురు గాలులకు అరటి తోటలు నేలకూలాయి. లక్ష్మీకాంతరెడ్డి, మోహనరెడ్డి, నారాయణరెడ్డి, నాగయ్యలకు చెందిన పంట దెబ్బతింది. దీంతో రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.
BDK: మణుగూరులోని ఏరియా స్టోర్ సమీపంలో ఉన్న ఈద్గా వద్ద రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఇవాళ ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ తెలుపుకుంటూ సోదరభావాన్ని చాటుకున్నారు. ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి దేశంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని అల్లాహ్‌ను వేడుకున్నారు.
KKD: రన్నింగ్ ట్రైన్స్‌లో ల్యాఫ్‌టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్‌ఫెక్టర్ సీహెచ్. ధనంజయ నాయుడు ఆధ్వర్యంలో స్టేషన్‌లో తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కాకినాడకు చెందిన అనంత దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.2 లక్షల విలువైన 4 ల్యాప్‌టాప్, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు.
VKB: పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని ఖాంజపూర్ సమీపంలోని తహలే అదీజ్ ఈద్గాలో శాసనమండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసి, శాంతి, ఐక్యతతో పండుగను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు పాల్గొన్నారు.
TG: రాష్ట్రంలో IT రంగంలో భారీగా ఉద్యోగాలు తగ్గుదలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఫైర్ అయ్యారు. 2023లో హైదరాబాద్‌లోని ఐటీ రంగంలో 9.46 లక్షల ఉద్యోగాలు ఉండేవని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, 2026 నాటికి అవి 9.39 లక్షలకు తగ్గాయని ప్రభుత్వం ఒప్పుకుందని పేర్కొన్నారు. ఉద్యోగాలు తగ్గాయని ప్రభుత్వం వారంలోనే రెండుసార్లు ఒప్పుకోవడం ఆందోళనకరమైన విషయమన్నారు.
NLG: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని బంగారుగడ్డ, అవంతిపురం ఈద్గాల వద్ద శనివారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేసిన అనంతరం ఆయన వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి, ధార్మిక చింతనకు నిలువుటద్దమని కొనియాడారు.
TG: కరీంనగర్ టూ టౌన్ SI చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. జమ్మికుంట మండలం సీతంపేటలోని తన అత్తింటిలో ఆయన ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. సరిగ్గా 5 రోజుల క్రితమే చంద్రశేఖర్ భార్య దివ్య కూడా ఆత్మహత్య చేసుకున్నారు. భార్య మరణంతో మనస్తాపానికి గురైన ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది.
KMR: పిట్లంలో రంజాన్ పండుగ వేడుకలు శనివారం ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరిగాయి. ఈ వేడుకల్లో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలన్నారు.