BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో రంజాన్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే ముస్లిం సోదరులు పట్టణంలోని ఈద్గా వద్దకు భారీగా చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నలు, పెద్దలు ఒకేచోట చేరి భక్తిశ్రద్ధలతో నమాజ్ చేశారు. ఏటా ఆనవాయితీగా ఇక్కడ వేడుకలు జరుపుకుంటామని, పండుగ వేళ అందరూ ఆనందంగా గడిపామని ముస్లిం సోదరులు తెలిపారు.
KMR: బిక్కనూర్ మండల టోల్ ప్లాజా సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం తెల్లవారుజామున 44వ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న డీసీఎం నుంచి నాలుగు అల్లం పేస్ట్ కాటన్లు జారిపడ్డాయి. దీనిని గమనించిన టోల్ సిబ్బంది, మరో వాహనంలో వెళ్లి లారీని వెంబడించి ఆ బాక్సులను డ్రైవర్‌కు భద్రంగా అందజేశారు. సిబ్బంది నిజాయితీని లారీ యజమాని అభినందించారు.
TG: భద్రాద్రి జిల్లా కొల్లుగూడెం వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ఐదుగురి గాలింపు ముగిసింది. నిన్న మూడు మృతదేహాలు లభ్యం కాగా, తాజాగా పాశం సతీష్, గోక తేజ మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. దీంతో ఈ విషాద ఘటనలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాల లభ్యతతో ఆయా కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. అధికారులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
BPT: బల్లికురవ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. అతివేగంతో వెళ్తున్న ఓ భారీ లారీ అకస్మాత్తుగా అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న పల్లపు ప్రాంతంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో లారీ క్యాబిన్‌లో ఉన్న డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
MLG: ఉపాధి హామీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సలుగు సంతోష్ అన్నారు. ములుగు జిల్లాలోని దేవా నగర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కూలీలకు పే-స్లిప్పులను సర్పంచ్ అందజేశారు. పనులు చేసే వద్ద ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సర్పంచ్ సూచనలు చేశారు.
PPM: కొమరాడ మండలం పరుశురాం పురం గ్రామంలో పిడుగు పడి పాడి ఆవు మృతి చెందినట్లు రైతు ముత్యాలు తెలిపారు. శుక్రవారం రాత్రి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో ఆవుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే ఆవు మరణించిందన్నారు. పాడే జీవనాధారంగా బతుకుతున్న.. తనకు తీవ్ర నష్టం వాటిలిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
AP: రంజాన్ వేళ పేదింట్లో మంత్రి లోకేష్ పండుగ కాంతులు నింపారు. మంగళగిరికి చెందిన షహెన్షా ఇంటికి గతేడాది ఆయన ఇఫ్తార్ విందుకు వెళ్లారు. షహెన్షా ఇంటి పరిస్థితిని చూసి నూతన గృహం నిర్మించి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏడాది తిరగకముందే రెండంతస్తుల ఇంటిని కట్టించి అందించారు. ఈ సందర్భంగా షహెన్షా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
SKLM: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ యువతకు కొత్త ఆశలను నింపిందని నరసన్నపేట నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన అన్నారు. యువగళంలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
KMM: ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పండుగ సందర్భంగా ఇవాళ వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర నెల క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక ఎమ్మెల్యే కొనియాడారు. అల్లాహ్ ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. పండుగను సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.
ధురంధర్-2 తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి తెలుగు, తమిళ్, మలయాళం లాంగ్వేజ్‌లు స్క్రీనింగ్ అవుతున్నాయి. కేవలం హిందీలోనే వచ్చిన పార్ట్-1 బ్లాక్‌బస్టర్ కావడంతో పార్ట్-2 గురించి తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా తెలుగులోనూ విడుదల చేస్తామని ప్రకటించారు. ఈనెల 19న రిలీజైనప్పటికీ సాంకేతిక కారణాల వల్ల తెలుగులో అందుబాటులోకి రాలేదు.
ELR: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని దెందులూరు నియోజకవర్గంలోని ముస్లిం కుటుంబాలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రంజాన్ తోఫా కిట్లను శనివారం అందజేశారు. పెదపాడు మండలం పొట్లూరు గ్రామంలో సేమియా, మటన్ తదితర పదార్థాలతో కూడిన కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కూటమి నాయకులు ఆయా గ్రామాల్లోని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
BDK: ముస్లిం సోదరుల ప్రార్థన మందిరాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశించారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 16వ వార్డులో గల ఈద్గాను వారు సందర్శించారు. అక్కడ ముస్లిం సోదరులు నిర్వహించే సామూహిక నమాజ్ కోసం చేసిన ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు. అనంతరం వారితో కలిసి ప్రార్థనలు చేశారు.
VZM: ఎండాకాలం కారణంగా పశుపక్షాదులకు దాహార్తిని తీర్చేందుకు మీ ఇంటి దగ్గర లేదా పరిసర ప్రాంతాలలో చిన్న చిన్న మంచినీటి తొట్టెలను ఏర్పాటు చెయ్యాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా ట్రెజరర్ షిణగం శివాజీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ పరిధిలో అనేక ప్రాంతాలలో పక్షులు నీళ్లు తాగేందుకు అవసరమైన సిమెంట్‌తో తయారు చేసిన మంచినీటి తొట్టెలను ఏర్పాటు చేశారు.
W.G: భీమవరం పట్టణంలోని పలు పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారి ఏ.ఎస్.రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రాల్లోని పాల నాణ్యతను పరిశీలించి, సేకరించిన నమూనాలను (శాంపిల్స్) పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపించినట్లు వెల్లడించారు.
పిల్లుల సాధారణ జీవితకాలం 12-17 ఏళ్లు మాత్రమే. ఆ సమయం ముగిశాక మరణించడం ప్రకృతి సహజం. కానీ పిల్లి చనిపోయిందని ఓ యువతి, పిల్లిని వద్దన్నారని MBBS విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హృదయ విదారక ఘటనలు ప్రజల మానసిక స్థైర్యంపై ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఇలా ప్రాణాలు తీసుకోవడం విచారకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.