• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేటి పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా

SKLM: రంజాన్ పండగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో శనివారం జరగాల్సిన పదో తరగతి పరీక్షను వాయిదా వేస్తున్నట్లు జిల్లా డీఈవో పి. రవిబాబు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఇవాళ జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేశారు. ఉపాధ్యాయులు మారిన తేదీల్లో యథావిధిగా విధులకు హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు.

March 21, 2026 / 05:46 AM IST

HYD బోటానికల్ గార్డెన్‌లో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

HYD: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో HYD బోటానికల్ గార్డెన్‌లో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిన్న ఘనంగా నిర్వహించారు. సుమారు 30 మంది వాకర్స్, సందర్శకులు పాల్గొన్నారు. పిచ్చుకలు పర్యావరణ సమతుల్యతకు కీలకమని అధికారులు తెలిపారు. గూడ్లు తయారు చేసి, ఎండాకాలంలో పక్షుల దాహం తీర్చేందుకు నీటి పాత్రలు చెట్ల నీడలో ఉంచారు. పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

March 21, 2026 / 05:45 AM IST

భక్తిశ్రద్ధలతో భ్రమరాంభ మల్లికార్జున స్వామి కళ్యాణం

SRD: హత్నూర మండలం పాల్పనూర్ గ్రామంలో ఉగాది మరుసటి రోజున నిర్వహించే భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించగా, సాయంత్రం ఒగ్గు పూజారుల నృత్యాల మధ్య బండ్లు, బోనాల ఊరేగింపు కనువిందుగా సాగింది. గ్రామస్థులు, బంధువుల రాకతో పాల్పనూర్లో పండుగ వాతావరణం నెలకొంది.

March 21, 2026 / 05:39 AM IST

మిట్టపల్లిలో అభివృద్ధి పనులు ప్రారంభం

NDL: బనగానపల్లె మండలంలోని మిట్టపల్లిలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రాథమిక పాఠశాల, కాపులపల్లెలో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు మొత్తం రూ.65.50 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తులసిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

March 21, 2026 / 05:39 AM IST

చౌటుకూరు సుంకులమ్మ ఆలయంలో విశేష పూజలు

NDL: మిడుతూరు మండలం చౌటుకూరులో వెలసిన సుంకులమ్మ ఆలయంలో చైత్రమాసం శుక్రవారం పూజలు భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక పుష్పాలంకరణలో అలంకరించి నైవేద్యాలను సమర్పించి మహా మంగళ హారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

March 21, 2026 / 05:38 AM IST

మాజీ సీఎం జగన్‌పై ఎమ్మెల్యే విమర్శలు

PLD: గంజాయిని వ్యాపారంగా మార్చుకుని మాజీ సీఎం YS జగన్ రూ.వేల కోట్లు వెనకేశారని గురజాల ఎమ్మెల్యే శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. శుక్రవారం పిడుగురాళ్లలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,474 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని పేర్కొన్నారు.

March 21, 2026 / 05:34 AM IST

CRDA కమిషనర్‌గా విజయరామరాజు

GNTR: CRDA కమిషనర్‌గా విజయరామరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కన్నబాబును పౌరసరఫరాల కమిషనర్‌గా నియమించింది. దీంతో త్వరలోనే విజయరామరాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో చెరుకూరి శ్రీధర్, వివేక్ యాదవ్, కాటమనేని భాస్కరరావు కమిషనర్లుగా పనిచేశారు.

March 21, 2026 / 05:30 AM IST

ఉచిత ‘సోలార్’ వెలుగులు.. వేలాది కుటుంబాలకు లబ్ధి

BPT: అద్దంకి నియోజకవర్గంలో ‘పీఎం సూర్య ఘర్’ పథకం ద్వారా పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ విద్యుత్ అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా మొత్తం 5,920 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ఈ మేరకు సంతమాగులూరు మండలం కొప్పరం పంచాయతీ పరిధిలోని నెహ్రూ నగర్ కాలనీలో సోలార్ పనులను విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నల్లూరి మస్తాన్ రావు ప్రారంభించారు.

March 21, 2026 / 05:30 AM IST

ఎలిగండ్లలో ఎడ్లబండ్ల పోటీలు.. విజేతలు వీరే..!

NRPT: మరికల్ మండలం ఎలిగండ్లలో ఉగాది సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి ఎడ్లబండ్ల గిరక పోటీలు ఉత్సాహంగా సాగాయి. మొదటి బహుమతి (రూ.15,000) వడ్యాట్‌కు చెందిన మహాదేవప్ప, ద్వితీయ బహుమతి (రూ.10,000) బసప్ప, తృతీయ బహుమతి (రూ.5,000) మదనపల్లి రైతు లింగప్ప గెలుచుకున్నారు. సర్పంచ్ అశ్విని నరేశ్ గౌడ్ విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.

March 21, 2026 / 05:30 AM IST

మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

కృష్ణా: మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తుల గడువు ఈనెల 31తో ముగియనుంది. అభ్యర్థులకు ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి. ఈ విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో 80, 6వ తరగతిలో 70, 7వ తరగతిలో 51, 8వ తరగతిలో 45 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల విద్యార్థులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

March 21, 2026 / 05:30 AM IST

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

GDWL: పెద్దదిన్నె ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కరేంద్రనాథ్ మాట్లాడుతూ.. తమ పాఠశాలలో ప్రైవేటుకు దీటుగా డిజిటల్ విద్య అందుబాటులో ఉందని, వసతుల కల్పనలో పాఠశాల ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

March 21, 2026 / 05:26 AM IST

మిర్చి రైతులను ముంచిన కోల్డ్ స్టోరేజీ యజమానులు

MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మానవపాడు, వడ్డెపాడు మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్నారు. అష్టకష్టాలు పడి పండించిన పంటను పక్క రాష్ట్రానికి తీసుకెళ్లగా అక్కడ దగా పడ్డామని, తమకు తెలియకుండానే కోల్డ్ స్టోరేజీ యజమానులు నిల్వలను విక్రయించుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమ్మినందుకు తమను నట్టేట ముంచారని రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

March 21, 2026 / 05:22 AM IST

డీసీసీ కార్యదర్శిగా భాగ్యరాజు నియామకం

మెదక్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా చేగుంట మండలానికి చెందిన బుడ్డ భాగ్య రాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ  ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నాయకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని భాగ్యరాజు పేర్కొన్నారు.

March 21, 2026 / 05:13 AM IST

నేడు రేపు నీటి సరఫరాకు అంతరాయం

SKLM: కవిటి మండలంలోని అన్ని గ్రామాలకు శనివారం, ఆదివారం నీటి సరఫరా నిలిచిపోతుందని ఎంపీడీవో ఎల్. త్రినాథ్ తెలిపారు. హిరమండలం హెడ్వర్క్స్ వద్ద ఉద్దానం పైపులైన్‌కు సంబంధించి ఇరిగేషన్ క్రాసింగ్ పనులు నిర్వహించనున్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. నీటి సరఫరా నిలిపివేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కవిటి మండల ప్రజలు సహకరించాలన్నారు.

March 21, 2026 / 05:11 AM IST

నేడు, రేపు నీటి సరఫరాకు అంతరాయం

SKLM: కవిటి మండలంలోని అన్ని గ్రామాలకు శనివారం, ఆదివారం నీటి సరఫరా నిలిచిపోతుందని ఎంపీడీవో ఎల్. త్రినాథ్ తెలిపారు. హిరమండలం హెడ్వర్క్స్ వద్ద ఉద్దానం పైపులైన్‌కు సంబంధించి ఇరిగేషన్ క్రాసింగ్ పనులు నిర్వహించనున్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. నీటి సరఫరా నిలిపివేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కవిటి మండల ప్రజలు సహకరించాలన్నారు.

March 21, 2026 / 05:11 AM IST