NDL: మిడుతూరు మండలం చౌటుకూరులో వెలసిన సుంకులమ్మ ఆలయంలో చైత్రమాసం శుక్రవారం పూజలు భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక పుష్పాలంకరణలో అలంకరించి నైవేద్యాలను సమర్పించి మహా మంగళ హారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.