TPT: పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కెరీర్ కౌన్సిలింగ్- వ్యక్తిత్వ వికాస సదస్సులో ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమౌళి మాట్లాడుతూ.. విద్యార్థులు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అతిథులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, మత్తు పదార్థాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అనన్య పాండే నటించిన కాల్ మీ బే మొదటి సీజన్ హిట్ కావడంతో, అమెజాన్ ప్రైమ్ రెండో సీజన్‌ను సిద్ధం చేస్తోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టులోకి స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చేరినట్లు వార్తలు వస్తున్నాయి. మరింత డ్రామా, కామెడీ, ఊహించని మలుపులతో రానున్న ఈ కొత్త సీజన్‌పై శృతి రాకతో అంచనాలు భారీగా పెరిగాయి. ఆమె ఇందులో ఒక కీలక పాత్రలో మెరవనుందని సమాచారం.
W.G: తాడేపల్లిగూడెంకు చెందిన తమ్మారెడ్డి రామ్ సిద్ధార్థ ఇటీవల విడుదలైన గేట్ పరీక్షలో ECE విభాగంలో 128వ ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ ప్రవేశ పరీక్షలో 128వ ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు శ్రీనివాస్ బాబు, పద్మలత హర్షం వ్యక్తం చేశారు. తండ్రి శ్రీనివాసబాబు RWSDEగా పనిచేస్తున్నారు.
CTR: యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తెలిపారు. విద్యా, పోలీస్ శాఖల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పారు. 20 నెలల్లో 6 లక్షలకుపైగా ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు భరోసా అని ఆయన పేర్కొన్నారు.
MHBD: నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామ మాజీ సర్పంచ్ కొలగాని నాగరాజు తండ్రి రిటైర్డ్ టీచర్ కొలగాని రాజయ్య ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత శుక్రవారం వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
TG: గోదావరిలో ఐదుగురు గల్లంతవ్వడం అత్యంత విషాదకరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతదేహాల వెలికితీత చర్యలు వేగవంతం చేయాలని యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. కాగా, పోలవరం జిల్లా ఏటపాక మండలం కూనవరం వద్ద భద్రాచలానికి చెందిన ఏడుగురు స్నానం కోసం నదిలోకి దిగగా.. ఐదుగురు గల్లంతయ్యారు.
ELR: ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు అన్నారు. శుక్రవారం ఉంగుటూరు(మం) నారాయణపురంలో పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి విజయకుమార్, గుమస్తా స్వరూప పాల్గొన్నారు.
NGKL: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి, గుండాల, కొట్ర గ్రామాల్లో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా పర్యటించారు. పశువుల షెడ్లు, కూరగాయల తోటలు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించారు. తోటల నిర్వహణపై రైతులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. గుండాల శివాలయంలోని శానిటరీ కాంప్లెక్స్ను కూడా తనిఖీ చేశారు.
NLR: సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర-స్వచంద్ర కార్యక్రమంలో భాగంగా వింజమూరు పర్యటన నేపథ్యంలో సభా స్థలాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్, జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లను, ట్యాంక్ బండ్ పనులను పరిశీలించి నిర్ణీత సమయంలోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
PDPL: జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ మంథని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలు, పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం రోగులకు అందుతున్న సేవలపై వివరాలు సేకరించారు. రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు. అలాగే పట్టణంలో నిర్మాణంలో ఉన్న సంగీత పాఠశాల, మున్సిపల్ కార్యాలయం, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్మాణ పనులు తనిఖీ చేశారు.
GNTR: జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సిబ్బంది గ్రీవెన్స్‌లో ఎస్పీ వకుల్ జిందాల్ ఫిర్యాదులను స్వీకరించారు. సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. శాఖపరమైన చర్యలు ఎదుర్కొంటున్న వారిని విచారణ అనంతరం తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.
KNR: గంగాధర మండలం కాచిరెడ్డిపల్లిలో భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను ఎస్సై వంశీకృష్ణ ప్రారంభించారు. SI వంశీ కృష్ణ మాట్లాడుతూ.. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను నియంత్రించడం, అనుమానాస్పద కదలికలను గుర్తించడం సులభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోలు మమత రాణి, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
SRCL: చందుర్తి మండలం ఆసిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఇవాళ ప్రపంచ పిచ్చుక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పిచ్చుకలపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్. రజిత మాట్లాడుతూ.. పిచ్చుకల జాతిని వ్యాప్తి చేయడం ద్వారా జీవవైవిధ్యానికి సహాయపడతాయన్నారు.
సత్యసాయి: కదిరి ఈద్గా ఖబరస్తాన్‌లో 55 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, ఐమాక్స్ లైట్లను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రారంభించారు. ముస్లిం మత పెద్దలతో కలిసి అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు. రెండేళ్లలో షాదీ మహల్ పూర్తి చేసి పేదలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.
MNCL: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన మంచిర్యాలలో మాట్లాడుతూ.. మొత్తం బడ్జెట్ 3,21,234 కోట్లు కాగా.. బీసీల సంక్షేమానికి కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు.