• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మంటగలిసిన మానవత్వం.. బతికుండగానే!

TG: మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతుంది. కాసుల కక్కుర్తిలో పడి బంధాలు కూడా మర్చిపోతున్నారు. అలాంటి ఘటనే జగిత్యాలలో జరిగింది. ఎండ్రికాయల శ్రీధర్‎ అనే వృద్ధుడిని కుటుంబసభ్యులు స్మశానవాటికలో వదిలివెళ్లారు. ఆయనకు కొంతకాలంగా రెండు కిడ్నీలు చెడిపొయి.. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో వైద్యం చేయించడం ఇష్టం లేక కుటుంబ సభ్యులు స్మశానంలో వదిలేశారు.

March 20, 2026 / 06:23 PM IST

ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ పక్కా.!

అన్నమయ్య: ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ, నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తోందని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు. గత 20 నెలల్లో సుమారు 6.30 లక్షల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. విద్య, పోలీస్ శాఖల ప్రాధాన్యతతో భారీ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

March 20, 2026 / 06:22 PM IST

‘నూతన భవనాలలోకి కార్యాలయాలను తరలించండి’

WNP: రేవల్లి, ఏదుల మండలాలలో నూతనంగా నిర్మించిన భవనాలలోకి తహసీల్దార్ కార్యాలయాలను తరలించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఆయా మండలాలలో ప్రారంభత్సవాలకు సిద్ధంగా ఉన్న భవనాలను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. భవనాల నిర్మాణ నాణ్యత, సౌకర్యాలు ఆయన పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

March 20, 2026 / 06:22 PM IST

ప్రభుత్వ కళాశాలలో ప్రపంచ అటవీ దినోత్సవం

PPM: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డి.రామయ్య మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర కీలకమన్నారు. మొక్కల ప్రాముఖ్యతను వివరిస్తూ, మనం ప్రకృతిని రక్షిస్తేనే అది మనల్ని కాపాడుతుందని పేర్కొన్నారు. 

March 20, 2026 / 06:22 PM IST

కమ్యూనిటీ సోప్ ఫిట్ పనుల పరిశీలన

MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న కమ్యూనిటీ సోప్ ఫిట్ నిర్మాణ పనులను జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య పరిశీలించారు. ఎంపీడీవో సతీష్, సర్పంచ్ వెంకటేష్‌లతో కలిసి పాఠశాలను సందర్శించారు. కమ్యూనిటీ సోప్ ఫిట్ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి సంగమేశ్వర్, వార్డు సభ్యులు ఉన్నారు.

March 20, 2026 / 06:21 PM IST

పెనుకొండలో రంజాన్ తోఫా పంపిణీ

సత్యసాయి: పెనుకొండ మండలంలో టిప్పు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా శుక్రవారం తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పెనుకొండ మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ ముహమ్మద్ తొయ్యిబ్ కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని సుమారు 225 కుటుంబాలకు రంజాన్ తోఫాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిప్పు ఫౌండేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

March 20, 2026 / 06:20 PM IST

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

W.G: పెనుగొండ-నెగ్గుపూడి ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అతివేగం, త్రిపుల్ రైడింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో త్రిపుల్ రైడింగ్ చేస్తున్న ముగ్గురితో పాటు, ఎదురుగా వస్తున్న వ్యక్తికి కూడా బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 20, 2026 / 06:20 PM IST

చంద్రబాబు, పవన్‌పై రోజా విమర్శలు

AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి రోజా విమర్శలు చేశారు. జగన్ కుటుంబ సమేతంగా ఉగాది జరుపుకున్నారని తెలిపారు. ఉగాది నాడు చంద్రబాబు, పవన్ ఎక్కడికి పోయారని నిలదీశారు. పవన్ కుటుంబ సమేతంగా ఎందుకు పండగ చేసుకోరని ప్రశ్నించారు. భార్యతో కలిసి చంద్రబాబు ఎందుకు ఉగాది చేసుకోలేదన్నారు.

March 20, 2026 / 06:19 PM IST

‘దురంధర్ 2’ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్

భారీ అంచనాల మధ్య రిలీజైన ధురంధర్-2 మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.241 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసింది. బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద ఓపెనర్‌గా రికార్డు సృష్టించింది. లాంగ్ వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించాడు.

March 20, 2026 / 06:19 PM IST

‘ధురంధర్ 2’ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్

భారీ అంచనాల మధ్య రిలీజైన ధురంధర్-2 మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.241 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసింది. బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద ఓపెనర్‌గా రికార్డు సృష్టించింది. లాంగ్ వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించాడు.

March 20, 2026 / 06:19 PM IST

‘గ్యాస్‌ను పొదుపుగా వాడుకోవాలి’

VZM: జిల్లాలో గృహ వినియోగ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, డిమాండ్‌కు సరిపడా సరఫరా జరుగుతోందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు శుక్రవారం నిర్వహించిన VC అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. అవసరానికి మించి గ్యాస్ బుకింగ్ చేయకుండా, పొదుపుగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.

March 20, 2026 / 06:19 PM IST

మీరు ఐ డ్రాప్స్ ఎక్కువగా వాడుతున్నారా..?

కంటి చుక్కల ముందులు ఎక్కువగా వాడటం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కంటి చుక్కల మందుల సీసాను తెరిచిన తర్వాత అందులో బ్యాక్టీరియా చేరకుండా ఉండటానికి PHMB అనే ఒక కెమికల్‌ను ప్రిజర్వేటివ్‌గా కలుపుతారు. ఇది మందును పాడవుకుండా ఉంచుతుంది కానీ.. కంటిపై మాత్రం దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.

March 20, 2026 / 06:16 PM IST

స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన.. ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి

AP: అనకాపల్లిలో స్టీల్‌ప్లాంట్ శంకుస్థాపనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 23న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు హోంమంత్రి అనిత ఏర్పాట్లు పరిశీలించారు. పటిష్ట బందోబస్తు, ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

March 20, 2026 / 06:15 PM IST

హజ్ యాత్ర.. సర్వం సిద్ధం..!

HYD: మే 4వ తేదీ నుంచి హజ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మే 4 నుంచి మే 21 వరకు యాత్ర కొనసాగనుంది. రాష్ట్రం నుంచి మొత్తం 11,757 మంది దరఖాస్తు చేసుకోగా, ప్రస్తుతానికి 9,500 మందికి అనుమతి లభించినట్లు అధికారులు వెల్లడించారు.

March 20, 2026 / 06:14 PM IST

విజ్ డమ్ హైస్కూల్ విద్యార్థినులకు ఘన సన్మానం

WGL: 2022-23 బ్యాచ్‌కు చెందిన శరదృతి, ముత్తినేని అంకిత 2025 నీట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్ సీట్లు పొందారు. శరదృతి కాకతీయ మెడికల్ కాలేజీ, అంకిత ఆదిలాబాద్ రిమ్స్‌లో ప్రవేశం పొందారు. ఈ మేరకు ఇవాళ పాఠశాల డైరెక్టర్ జావేద్ విద్యార్థులను సన్మానించి అభినందించారు. విద్యార్థులు పట్టుదలతో, క్రమశిక్షణతో విద్యలో రాణించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

March 20, 2026 / 06:14 PM IST