కంటి చుక్కల ముందులు ఎక్కువగా వాడటం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కంటి చుక్కల మందుల సీసాను తెరిచిన తర్వాత అందులో బ్యాక్టీరియా చేరకుండా ఉండటానికి PHMB అనే ఒక కెమికల్‌ను ప్రిజర్వేటివ్‌గా కలుపుతారు. ఇది మందును పాడవుకుండా ఉంచుతుంది కానీ.. కంటిపై మాత్రం దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.