AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి రోజా విమర్శలు చేశారు. జగన్ కుటుంబ సమేతంగా ఉగాది జరుపుకున్నారని తెలిపారు. ఉగాది నాడు చంద్రబాబు, పవన్ ఎక్కడికి పోయారని నిలదీశారు. పవన్ కుటుంబ సమేతంగా ఎందుకు పండగ చేసుకోరని ప్రశ్నించారు. భార్యతో కలిసి చంద్రబాబు ఎందుకు ఉగాది చేసుకోలేదన్నారు.